ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీట్లకు 24న అదనపు మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-04-24T09:01:16+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలలు యూజీ, పీజీ సీట్లను బ్లాకింగ్‌ చేస్తున్నాయన్న

ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీట్లకు 24న అదనపు మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, హనుమకొండ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలలు యూజీ, పీజీ సీట్లను బ్లాకింగ్‌ చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ కోటాలోని ఎంబీబీఎస్‌ సీట్లకు ఈనెల 24న అదనపు మాప్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. అనంతరం నిర్వహించిన మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ తర్వాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 24న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 

Read more