సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపా!

ABN , First Publish Date - 2022-05-24T09:40:06+05:30 IST

తన (మాజీ) డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ అంగీకరించారు.

సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపా!

వైసీపీ ఎమ్మెల్సీఉదయభాస్కర్‌ అంగీకారం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి): తన (మాజీ) డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ అంగీకరించారు. అయితే మాటామాటా పెరిగి కోపంతో కొట్టడంతో అతడు చనిపోయాడని ఎమ్మెల్సీ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరుగగా.. ఉదయభాస్కర్‌ను అరెస్టు చేయని సంగతి తెలిసిందే. తమ అదుపులోనే ఉంచుకున్న పోలీసులు.. అన్ని వర్గాల నుంచీ నిరసనలు వెల్లువెత్తడంతో సోమవారం రాత్రి ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. హత్య జరిగిన రోజు రాత్రి నుంచి మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటికి తరలించే వరకు జరిగిన పరిణామాలన్నింటినీ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పేరిట అడిగి వివరాలు సేకరించారు.  ఈ అరెస్టు  విషయమై సోమవారం సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. తమ అదుపులోనే ఉన్నా ఎమ్మెల్సీని అరెస్టు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు రేగాయి. సాయంత్రం ఐదున్నర గంటలకల్లా విచారణ, కేసు రికార్డు వివరాలు కొలిక్కి రావడంతో డీఐజీ పాలరాజు వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు ఉదయభాస్కర్‌ను సోమవారం రాత్రి 7.15 గంటలకు జీజీహెచ్‌కు వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు. అక్కడ పరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. 

Read more