జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల సత్తా

ABN , First Publish Date - 2022-09-13T10:19:14+05:30 IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులను మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల సత్తా

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులను మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు సోమవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో సత్యవతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన గురుకులాల్లో శిక్షణ పొందిన 237 మంది విద్యార్థుల్లో 132 మంది ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. 

Read more