అభినవ అంబేడ్కర్‌ సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-19T09:01:39+05:30 IST

అభినవ అంబేడ్కర్‌ సీఎం కేసీఆర్‌ అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ కొనియాడారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అభినవ అంబేడ్కర్‌ సీఎం కేసీఆర్‌

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ ప్రశంస

సంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 18: అభినవ అంబేడ్కర్‌ సీఎం కేసీఆర్‌ అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ కొనియాడారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శరత్‌ సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. గిరిజనులకు 10ు రిజర్వేషన్‌ కల్పిస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టిన గిరిజన బిడ్డగా తన మనసులోని మాటలను ఒక పౌరుడిగా చెబుతున్నానని పేర్కొన్నారు. ‘అంబేడ్కర్‌ను చూడలేదు.. కానీ ఈనాటి అభినవ అంబేడ్కర్‌ను సీఎం కేసీఆర్‌లో చూస్తున్నాను’ అని చెప్పారు. భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అణగారిన వర్గాల అభ్యున్నతి పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న అభిమానానికి నిదర్శనమని ప్రశంసించారు. తెలంగాణ సచివాలయానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టారంటే దళితవర్గాల పట్ల ఆయనకున్న అభిమానం వెలకట్టలేనిదన్నారు. సీఎం కేసీఆర్‌కు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-19T09:01:39+05:30 IST