అసెంబ్లీలో సీపీఎస్‌ రద్దు తీర్మానం చేయాలి

ABN , First Publish Date - 2022-09-10T09:02:02+05:30 IST

రాష్ట్రంలోని రెండు లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎ్‌స)ను రద్దు చేసి, పాత పెన్షన్‌

అసెంబ్లీలో సీపీఎస్‌ రద్దు తీర్మానం చేయాలి

ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంఘం డిమాండ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రెండు లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎ్‌స)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎస్‌) అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాముక కమలాకర్‌, చీటి భూపతిరావు విజ్ఞప్తి చేశారు. సీపీఎస్‌ ఉద్యోగుల కోసం ఇటీవల తీసుకొచ్చిన కుటుంబ పెన్షన్‌ విధానంలో కొంత మార్పు చేయాలని వారు కోరారు. ఉద్యోగుల ప్రాన్‌ అకౌంట్‌లోని సొమ్మును ప్రభుత్వానికి సరెండర్‌ చేయకుండానే పాత పెన్షన్‌ విధానం ప్రకారం కుటుంబ పెన్షన్‌ను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Read more