అశ్రునయనాలతో మందాడికి అంతిమ వీడ్కోలు

ABN , First Publish Date - 2022-11-16T04:11:17+05:30 IST

హనుమకొండ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.

అశ్రునయనాలతో మందాడికి అంతిమ వీడ్కోలు

హనుమకొండ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కడసారి నివాళులర్పించారు. అశేష ప్రజానీకం అశ్రునయనాల మధ్య మందాడికి మంగళవారం హనుమకొండ పద్మాక్షిగుట్ట సమీపంలోని వైకుంఠధామంలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన కుమారుడు శ్యామ్‌సుందర్‌రెడ్డి చితికి నిప్పటించారు. అంతిమయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ సీనియర్‌ నేతలు ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్‌ రెడ్డి, రావు పద్మతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T04:11:17+05:30 IST

Read more