కేసీఆర్‌ పాలనకు కౌంట్‌డౌన్‌ పేరుతో బీజేపీ ఆఫీస్‌ దగ్గర డిజిటల్ బోర్డు

ABN , First Publish Date - 2022-08-17T13:26:05+05:30 IST

కేసీఆర్‌ పాలనకు కౌంట్‌డౌన్‌ పేరుతో బీజేపీ ఆఫీస్‌ దగ్గర డిజిటల్ బోర్డు

కేసీఆర్‌ పాలనకు కౌంట్‌డౌన్‌ పేరుతో బీజేపీ ఆఫీస్‌ దగ్గర డిజిటల్ బోర్డు

హైదరాబాద్: మళ్లీ 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ డిజిటల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ పాలనకు కౌంట్‌డౌన్‌ పేరుతో బీజేపీ ఆఫీస్‌ దగ్గర డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. డిజిటల్‌ బోర్డును బీజేపీ ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్ ప్రారంభించనున్నారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ డిజిటల్‌ బోర్డులను జీహెచ్‌ఎంసీ అధికారులు నిలిపివేశారు. ఈసారి బీజేపీ ఆఫీస్‌ ప్రహారీ గోడ లోపల డిజిటల్‌ బోర్డ్ ఏర్పాటు చేసినట్లు బీజేపీ తెలిపింది. ఐరన్ పిల్లర్‌ నిర్మించి డిజిటల్‌ బోర్డ్‌ను ఏర్పాటు చేసినట్లు కమలం పార్టీ స్పష్టం చేసింది.

Read more