833 ఏఈ పోస్టుల భర్తీ!

ABN , First Publish Date - 2022-09-13T08:56:50+05:30 IST

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది.

833 ఏఈ పోస్టుల భర్తీ!

టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌.. 28 నుంచి దరఖాస్తులు


హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ‘తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ)’ అధికారులు వరసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం 833 అసిస్టెంట్‌ ఇంజనీర్ల (ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లోని ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.


ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసిన 833 పోస్టుల్లో ఏఈలు, మునిసిపల్‌ ఏఈలు, టెక్నికల్‌ అధికారులు, జూనియర్‌ టెక్నికల్‌ అధికారులు.. వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 21 మధ్య దరఖాస్తులను చేసుకోవచ్చని టీఎ్‌సపీఎస్సీ అధికారులు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న జారీ చేయనున్నట్లు అఽధికారులు ప్రకటించారు.  ఫుడ్‌ సేప్టీ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్‌ చేసుకునే అవకాశాన్ని టీఎ్‌సపీఎస్సీ కల్పించింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి 16 వరకు తమ దరఖాస్తులను ఎడిట్‌ చేసుకునే వీలు కల్పించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మహిళా, శిశు సంక్షేమ అధికారుల పోస్టులకు మంగళవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు టీఎ్‌సపీఎస్సీ అధికారులు ప్రకటించారు. వచ్చే నెల 10 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.

Read more