610 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-09-13T09:55:05+05:30 IST

ఉమ్మడి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వేర్వేరు బృందాలు సోమవారం 610 కిలోల గంజాయిని సీజ్‌ చేశాయి.

610 కిలోల గంజాయి పట్టివేత

రెండు అంతర్రాష్ట్ర ముఠాలకు బేడీలు

హైదరాబాద్‌ సిటీ/రాజేంద్రనగర్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వేర్వేరు బృందాలు సోమవారం 610 కిలోల గంజాయిని సీజ్‌ చేశాయి. రాచకొండ పోలీసులు 360 కిలోలు, సైబరాబాద్‌ బలగాలు మరో 250 కిలోల చొప్పున స్వాధీనం చేసుకుని, రెండు అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన 10 మందిని అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ విలేకరులకు తెలిపారు. ఈ ముఠాకు సం బంధించి ఆరుగురు సభ్యులను అరెస్టు చేశామని, వారి నుంచి మూడు కార్లు, రూ. 10 వేల నగదు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సీజ్‌ చేసిన గంజాయి, కార్లు, నగదు, సెల్‌ఫోన్ల విలువ రూ. 1.20 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. కాగా.. వైజాగ్‌ నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు 250 కిలోల గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాను సైబరాబాద్‌ పరిధిలోని శంషాబాద్‌ ఎస్‌వోటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు పట్టుకున్నారు. ఔటర్‌రింగ్‌ రోడ్డుపై కాపుకాచిన పోలీసులు ఓ లారీని సీజ్‌ చేసి, 250కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు సమ్మగ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిసింది.

Updated Date - 2022-09-13T09:55:05+05:30 IST