భోజనం వికటించి 54 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-08-21T08:20:41+05:30 IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 54 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

భోజనం వికటించి 54 మంది విద్యార్థులకు అస్వస్థత

ఎల్లారెడ్డి, ఆగస్టు 20: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 54 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసి పడుకొన్న తర్వాత అర్ధరాత్రి 40 మంది విద్యార్థినులకు వాంతులు, విరోచనాలయ్యాయి. కడుపు నొప్పితో బాధపడ్డారు. సిబ్బంది వెంటనే వారిని ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం మరో 14 మంది విద్యార్థినులకు వాంతులయ్యాయి.  ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. 

Read more