రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-02-19T07:37:45+05:30 IST

రాష్ట్రంలో 12 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కొత్తగా

రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా కేసులు

  • హైదరాబాద్‌లో 130 మందికి పాజిటివ్‌


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంఽధ్రజ్యోతి): రాష్ట్రంలో 12 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కొత్తగా పదిలోపే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 41,042 మందికి కొవిడ్‌ టెస్టులు చేశారు. అందులో కొత్తగా 425 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మరో 1,060 మంది కోలుకున్నారు. హైదరాబాద్‌లో 130 కేసులొచ్చాయి. శుక్రవారం 1.45 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 92 శాతం మంది రెండో డోసు తీసుకున్నట్లు వైద్యశాఖ ప్రకటించింది. 


Read more