దసరాకు 4,198 ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2022-09-21T07:59:49+05:30 IST

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 4,198 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీఎ్‌సఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ తెలిపారు.

దసరాకు 4,198 ప్రత్యేక బస్సులు

  • ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ 5 వరకు
  • స్పెషల్‌ బస్సుల్లోనూ సాధారణ చార్జీలే

హైదరాబాద్‌ సిటీ/చాదర్‌ఘట్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 4,198 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీఎ్‌సఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఈ నెల 24, 25 తేదీలతో పాటు సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 5 వరకు స్పెషల్‌ సర్వీసులను సాధారణ చార్జీలతో నడుపనున్నట్లు చెప్పారు. మంగళవారం ఎంబీజీబీఎ్‌సలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. 24, 25 తేదీల్లో 737 బస్సులు, 30న 506 బస్సులు, అక్టోబర్‌ 1న 549, 2న 684, 3న 766, 4న 838, 5న 119 ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే సర్వీసులు పెంచుతామన్నారు. అడ్వాన్స్‌ రిజర్వేషన్‌కు వీలుగా 517 అదనపు బస్సులు సిద్ధం చేశామని, టీఎ్‌సఆర్టీసీ వైబ్‌సైట్‌లో టికెట్లు రిజర్వు చేసుకోవచ్చన్నారు. కాగా, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అక్టోబరు 2 నుంచి శివారు ప్రాంతాల నుంచి జిల్లాలకు షెడ్యూల్డ్‌ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు నడుపుతామని అధికారులు తెలిపారు. ఏ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరతాయనే వివరాలివీ..

 జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలకు.. 

ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌, తొర్రూర్‌, వరంగల్‌ వైపు..

దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ స్టేషన్‌ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేటకు..

సీబీఎస్‌ నుంచి కర్నూల్‌ , తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లివైపు..


ఎంక్వైయిరీ నంబర్లు ఎంజీబీఎస్‌

99592 26257 

జేబీఎస్‌ 040-

2780 2203, 

73828 38685 

Read more