40 శాతం కమీషన్‌ హోర్డింగ్‌.. ఓ కుట్ర!

ABN , First Publish Date - 2022-09-19T09:14:33+05:30 IST

కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టులపై 40 శాతం కమీషన్‌ తీసుకుంటోందని తెలంగాణలో బ్యానరు ఏర్పాటు చేయడాన్ని కుట్రగా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అభిప్రాయపడ్డారు.

40 శాతం కమీషన్‌ హోర్డింగ్‌.. ఓ కుట్ర!

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై 

బెంగళూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టులపై 40 శాతం కమీషన్‌ తీసుకుంటోందని తెలంగాణలో బ్యానరు ఏర్పాటు చేయడాన్ని కుట్రగా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సాగుతున్న అవినీతిపై కర్ణాటకలో హోర్డింగ్‌లు పెడితే తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో హోర్డింగ్‌ ఏర్పాటు చేశారనే విషయమే తనకు తెలియదని... ఇటువంటి చర్యలు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తాయని తెలిపారు. కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ ఆదివారం చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లిలో జరిగే సీపీఎం సభల్లో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా బొమ్మైతో భేటీ అయ్యారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  

Read more