తొలి త్రైమాసికంలో 36 శాతం వృద్ధి:సింగరేణి

ABN , First Publish Date - 2022-07-05T09:42:19+05:30 IST

సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అమ్మకాల్లో గత ఏడాదితో పోల్చితే 36 శాతం వృద్థిని నమోదు చేసింది.

తొలి త్రైమాసికంలో 36 శాతం వృద్ధి:సింగరేణి

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అమ్మకాల్లో గత ఏడాదితో పోల్చితే 36 శాతం వృద్థిని నమోదు చేసింది. గతేడాది రూ. 5,374 కోట్ల అమ్మకాలు జరిపిన సింగరేణి, ఈ ఏడాది రూ. 8,670 కోట్ల అమ్మకాలు జరిపింది. ఇది దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ప్రగతిలో అత్యధికం అని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. బొగ్గు అమ్మకం ద్వారా రూ.7,598 కోట్లు, విద్యుత్తు విక్రయం ద్వారా రూ. 1,062 కోట్ల టర్నోవర్‌ సాధించినట్లు సింగరేణి భవన్‌లో జరిగిన అధికారుల సమీక్షలో పేర్కొన్నారు.  

Read more