ఏపీకి చెందిన 26 కులాలను తిరిగి బీసీల్లో చేర్పించండి

ABN , First Publish Date - 2022-11-25T04:08:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కోరారు.

ఏపీకి చెందిన 26 కులాలను   తిరిగి బీసీల్లో చేర్పించండి

గవర్నర్‌ తమిళిసైకు బీజేపీ వినతి

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫై చేసిన 26 బీసీ కులాలను తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ జాబితా నుంచి తొలగించిందని తెలిపారు. ఇందుకు సంబంధించి బీసీ కమిషన్‌కు సిఫారసు చేయలేదని, కనీసం వారి ఆర్థిక స్థితిగతులపై సర్వే కూడా నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. వీరంతా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అత్యంత వెనుకబడిన వర్గాల వారని వివరించారు. లక్ష్మణ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసింది. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ పీ.వీ.ఎన్‌. మాధవ్‌ కూడా ఈ బృందంలో ఉన్నారు.

Updated Date - 2022-11-25T04:08:54+05:30 IST

Read more