వాంతులు, విరేచనాలతో 17 మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2022-08-25T08:23:24+05:30 IST

వాంతులు, విరేచనాలతో వికారాబాద్‌ జిల్లాలో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వాంతులు, విరేచనాలతో 17 మందికి అస్వస్థత

పెద్దేముల్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): వాంతులు, విరేచనాలతో వికారాబాద్‌ జిల్లాలో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌ తరలించారు. పెద్దేముల్‌ మండలం ఆడ్కిచర్ల ఎస్సీ కాలనీలో మూడు రోజులుగా 15 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొందరు, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొందరు చికిత్స పొం దుతున్నారు. బుధవారం మరో ఇద్దరు ఆస్పత్రిలో చేరారు. అయితే, అనారోగ్యానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎస్సీ కాలనీవాసులు మిషన్‌ భగీరథ నీటిని తాగడం లేద ని తెలిసింది. డైరెక్ట్‌ పంపింగ్‌ ద్వారా వచ్చే నీటినే తాగడానికి ఉపయోగిస్తున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు.   ఆడ్కిచర్లలో మెడికల్‌ క్యాంపు నిర్వహించారు.

Updated Date - 2022-08-25T08:23:24+05:30 IST