16 వేల టెస్టులు.. 155 కేసులు

ABN , First Publish Date - 2022-06-11T08:38:49+05:30 IST

రాష్ట్రంలో నాలుగు రోజుల్లో కొవిడ్‌ కేసులు రెట్టింపయ్యాయి.

16 వేల టెస్టులు.. 155 కేసులు

రాష్ట్రంలో కొత్తగా 155 కొవిడ్‌ పాజిటివ్‌లు 

నాలుగో రోజూ వందకు పైనే నమోదు

హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగు రోజుల్లో కొవిడ్‌ కేసులు రెట్టింపయ్యాయి. ఈ 6వ తేదీన 65 పాజిటివ్‌లు రాగా, శుక్రవారం 155 కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజూ బాధితుల సంఖ్య వందపైనే ఉండడం గమనార్హం. శుక్రవారం 16,319 మందికి పరీక్షలు చేశారు. కొత్త కేసుల్లో హైదరాబాద్‌వే అధికం. రాజధానిలో 94, మేడ్చల్‌లో 9, రంగారెడ్డిలో 12 నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 907కు చేరింది.

Read more