12-14 ఏళ్ల బాలలు.. 17.23 లక్షల మంది

ABN , First Publish Date - 2022-03-16T09:16:18+05:30 IST

రాష్ట్రంలో బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు వెల్లడించారు.

12-14 ఏళ్ల బాలలు.. 17.23 లక్షల మంది

రాష్ట్రంలో నేటి నుంచే వారికి వ్యాక్సినేషన్‌

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు వెల్లడించారు. తెలంగాణలో ఆ వయోవర్గం వారు 17.23 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీరికి టీకా అందుబాటులో ఉంచామన్నారు. వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో ముందే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ లేకుండా నేరుగా వచ్చినా వ్యాక్సిన్‌ ఇస్తామని పేర్కొన్నారు. 

Read more