ఇకపై జూమ్‌ టీమ్‌ చాట్‌

ABN , First Publish Date - 2022-09-17T08:08:36+05:30 IST

జూమ్‌ తన చాట్‌ ప్రొడక్ట్‌ని ‘జూమ్‌ టీమ్‌ చాట్‌’గా మార్చింది. అదనంగా కొన్ని ఫీచర్లనూ జత చేసింది. షేర్‌ ఇన్‌-మీటింగ్‌ చాట్‌ కాస్తా టీమ్‌ చాట్‌గా సామర్థ్యం పెంచుకుంది.

ఇకపై జూమ్‌ టీమ్‌ చాట్‌

జూమ్‌ తన చాట్‌ ప్రొడక్ట్‌ని ‘జూమ్‌ టీమ్‌ చాట్‌’గా మార్చింది. అదనంగా కొన్ని ఫీచర్లనూ జత చేసింది. షేర్‌ ఇన్‌-మీటింగ్‌ చాట్‌ కాస్తా టీమ్‌ చాట్‌గా సామర్థ్యం పెంచుకుంది. చాట్‌ నుంచి మీటింగ్‌ షెడ్యూల్‌ లేదా చానల్‌కు అవకాశం కల్పిస్తోంది. ఈ జోడింపులన్నీ నెలాఖరులోగా  సమకూరనున్నాయి. వీడియో మీటింగ్‌ యాప్‌గా ఆరంభమైన దీని ప్రస్థానం వెబినార్స్‌, కాన్ఫరెన్స్‌ రూమ్స్‌ కనెక్టింగ్‌ తదితర సేవలకు విస్తరించింది. మెసేజింగ్‌, ఫైల్‌ షేరింగ్‌, థర్డ్‌ పార్టీ ఇంటిగ్రేషన్స్‌, వీడియో, వాయిస్‌ వంటి వాటన్నింటినీ టీమ్‌ చాట్‌ ఒకదగ్గరకు చేర్చిందని కంపెనీ తన బ్లాగ్‌ పోస్టులో వెల్లడించింది. చాట్‌ సంభాషణను ఎలివేట్‌ చేయాలనుకుంటే జూమ్‌ టీమ్‌ చాట్‌లో కుడిపక్కన ఉన్న బటన్‌ను టచ్‌ చేయాలని పేర్కొంది.

Read more