వాట్సాప్‌ మెసేజెస్‌నూ ఎడిట్‌ చేయొచ్చు!

ABN , First Publish Date - 2022-09-24T06:50:34+05:30 IST

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరించడంలో వాట్సాప్‌నకు ప్రత్యేక స్థానమే ఉంది.

వాట్సాప్‌ మెసేజెస్‌నూ ఎడిట్‌ చేయొచ్చు!

ప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరించడంలో వాట్సాప్‌నకు ప్రత్యేక స్థానమే ఉంది. తాజాగా సెండ్‌ చేసిన సందేశాలను ఎడిట్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించే పనిలో ప్రస్తుతం వాట్సాప్‌ ఉన్నట్టు సమాచారం. డబ్ల్యుఎబేటాఇన్ఫో - ప్రత్యేకించి  వాట్సాప్‌లో చేంజెస్‌ను తెలియజేసే ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని బైటపెట్టింది. ఎడిట్‌ మెసేజ్‌ అని కొత్త ఫీచర్‌కు పేరు పెట్టినట్టు తెలియజేసింది. దీని సహాయంతో మెసేజ్‌లో ఉన్న తప్పులను సరిదిద్దుకునే అవకాశం యూజర్‌కు లభిస్తుంది. అయితే ఈ ఫీచర్‌ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్నది తెలియదు. వాస్తవానికి ఆండ్రాయిడ్‌ బేటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను కనుగొన్నారు. ఆ కారణంగా ఆండ్రాయిడ్‌లో మొదట అందుబాటులోకి రావచ్చు. వాట్సాప్‌ ఇప్పటికే ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్విర్‌వన్‌’ ఫీచర్‌తో సెంట్‌ చేసిన మెసేజ్‌లను తొలగించే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే కొత్త ఫీచర్‌తో మొత్తం తొలగించాల్సిన అవసరం ఉండదు. కేవలం తప్పులను దిద్దుకోగలిగితే సరిపోతుంది. కొన్ని ఐఫోన్లలో రాబోయే అక్టోబర్‌ 24 నుంచి వాట్సాప్‌ ఉండదు. ఐఓఎస్‌10 ఐఔస్‌11 మీద పనిచేసే ఐఫోన్లలో పనిచేయదు. అంటే ఐఫోన్‌5, ఐఫోన్‌ 5సి యూజర్లకు కొత్త వెర్షన్‌ ఐఫోన్‌ లభిస్తుంది. లేదంటే ఇంకో ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫారం ఆరంభమవుతుంది. 

Read more