ఇలా చేస్తే వాట్సాప్‌ సేఫ్‌

ABN , First Publish Date - 2022-10-01T06:21:41+05:30 IST

రెండంచెల వెరిఫికేషన్‌ను ఉపయోగించుకోవాలి

ఇలా చేస్తే వాట్సాప్‌ సేఫ్‌

వీటిలో మొదటిది ‘డిజెపియరింగ్‌ మెసేజెస్‌’. ఇండివిడ్యుయల్‌, గ్రూప్‌ చాట్స్‌లో మెసేజె్‌సను నిర్దేశిత గడువు పెట్టి పంపుతుంటారు. ‘వ్యూవన్స్‌’ కూడా ఒకటి. అవి ఒకసారి ఓపెన్‌ కాగానే అదృశ్యమవుతాయి. అలాంటి వాటికి వాట్సాప్‌ కూడా స్ర్కీన్‌షాట్‌ సౌకర్యాన్ని తొలగిస్తుంది. 

రెండంచెల వెరిఫికేషన్‌ను ఉపయోగించుకోవాలి. తద్వారా మరో స్థాయి భద్రతను వాట్సాప్‌ అందిస్తోంది. అకౌంట్‌ రీసెట్టింగ్‌ లేదా వెరిఫై చేసుకునేటప్పుడు ఆరు సంఖ్యల పిన్‌ అవసరమవుతుంది. సిమ్‌ కార్డు పోవడం లేదంటే ఫోన్‌నే ఎవరో తస్కరించడం జరిగినప్పుడు ఈ వెరిఫికేషన్‌తో అప్రమత్తం కావచ్చు. 

అవసరం లేని కాంటాక్ట్‌లను బ్లాక్‌ చేసే సదుపాయం వాట్సా్‌పలో ఉంది. సమస్యాత్మక మెసేజ్‌లు వస్తే వాట్సా  ్‌పనకు రిపోర్ట్‌ చేయవచ్చు. అనుచిత మెసేజ్‌ల విషయంలో ఫ్యాక్ట్‌ చెకర్స్‌ లేదంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో షేర్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. 

సెన్సిటివ్‌ సమాచారం అంటే చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, పాస్‌వర్డ్స్‌, క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు నంబర్లు, బ్యాంక్‌ అకౌంట్‌ సమాచారం వంటివి వాట్సా్‌పతో తెలియజేయడం మంచిది కాదు.

పర్సనల్‌ వివరాల విషయంలో కంట్రోల్‌కు యూజర్లకు అవకాశం ఉంటుంది. ప్రొఫైల్‌ ఫొటో, లాస్ట్‌ సీన్‌, ఆన్‌లైన్‌ స్టాటస్‌, అమౌంట్‌, స్టాటస్‌, ఎవరు చూశారు.... ఎవ్విర్‌వన్‌, కాంటాక్ట్స్‌ ఓన్లీ, సెలెక్ట్‌ కాంటాక్ట్‌, ఎవరూ కాదు వంటి ఆప్షన్లు ఉంటాయి. కొత్తవారితో ప్రొఫైల్‌ పిక్చర్‌ను షేర్‌ చేసుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. 

ఆన్‌లైన్‌ ప్రజన్స్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. యూజర్‌ ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరు చూడొచ్చు, మరెవరు చూడకూడదన్నది స్వయంగా ఎంపిక చేసుకోవచ్చు. 

స్పామ్‌ మెసేజ్‌లు, సైబర్‌ బెదిరింపులు, మోసాలకు ఇంటర్నెట్‌ నిలయంగా ఉంది. ఫేక్‌ జాబ్‌ ఆఫర్‌, నగదు బహుమతి పొందారంటూ మెసేజ్‌లు సహా చాలా రకాల మోసాలు ఉంటాయి. కొన్ని తెలియని నంబర్ల నుంచి స్పాన్సర్డ్‌ ట్రిప్స్‌ కోసం ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఆ మెసేజ్‌లో వెబ్‌సైట్‌ లింక్‌ లేదంటే రిక్వెస్ట్‌ యాక్సెస్‌ ఉంటుంది. తద్వారా మాల్వేర్‌ పంపడమే కాదు మోసాలకు తెరలేస్తోంది. అదే వాట్సా    ్‌పలో వస్తే స్పెసిఫిక్‌ మెసేజ్‌తో రిపోర్టు చేసే అవకాశం     వాట్సాప్‌లో ఉంటుంది. అందుకోసం సదరు మెసేజ్‌ ఆ మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేసి ‘రిపోర్ట్‌’ లేదా ‘బ్లాక్‌ ఎ యూజర్‌’ చేయవచ్చు. 

అధికారిక సోర్సు నుంచి మాత్రమే వాట్సా్‌పను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. డెస్క్‌ టాప్‌ కోసం జ్ట్టిఞట://ఠీఠీఠీ.ఠీజ్చ్టిట్చఞఞ.ఛిౌఝ/ ఛీౌఠీుఽజూ్చౌఛీ/. అదే ఫోన్ల కోసం యాపిల్‌ స్టోర్‌ లేదా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 


వాట్సాప్‌ అటు వ్యక్తిగత ఇటు అధికారిక మెసేజింగ్‌కు వేదికగా మారి చాలా కాలమైంది. పాపులారిటీ విపరీతంగా ఉండటంతో సహజంగానే క్రిమినల్స్‌ దృష్టిని ఆకర్షిస్తోంది. అమాయకులను వంచించే పనులకు వాట్సాప్‌ సులువైన వాహకంగా మారింది. ఫిషింగ్‌ లింక్స్‌తో బ్యాంక్‌ అకౌంట్స్‌ నుంచి డబ్బులు దోచేయడం కొందరికి నిత్యకృత్యంగా మారింది. ఈ నేపథ్యంలో యూజర్లను రక్షించేందుకు పలు రక్షణ చర్యలను వాట్సాప్‌ ఇప్పటికే తీసుకుంది. వాటిని తెలుసుకోవడమే కాదు, ఆచరిస్తేనే ప్రమాదాల నుంచి బైటపడవచ్చని వాట్సాప్‌ చెబుతోంది. ఏవి ఉపయోగించుకుని ఎలా ఈ ప్రమాదాలకు  దూరంగా ఉండొచ్చో వివరించింది. 

Read more