Send Money without Internet: ఫోన్‌పే, గూగుల్ పే ఏదైనా సరే.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఈ నెంబర్‌ను డయల్ చేస్తే..

ABN , First Publish Date - 2022-11-21T16:31:39+05:30 IST

UPI లావాదేవీలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండడం లేదా పూర్తిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో చెల్లింపు సాధ్యం కాదు. అయితే మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా UPI లావాదేవీలు చేయవచ్చు.

Send Money without Internet: ఫోన్‌పే, గూగుల్ పే ఏదైనా సరే.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఈ నెంబర్‌ను డయల్ చేస్తే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు జరగాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ సౌకర్యాం ఉండాల్సిందే. UPI లావాదేవీలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండడం లేదా పూర్తిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో చెల్లింపు సాధ్యం కాదు. అయితే మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా UPI లావాదేవీలు (UPI payment without internet) చేయవచ్చు.

అవును.. ఇంటర్నెట్ లేకపోయినా మీరు UPI ద్వారా చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీని కోసం మీరు USSD కోడ్‌ని ఉపయోగించాలి. మీరు ఇంతకు ముందు Google Pay, Phone-Pe, Paytm లేదా BHIM వంటి UPI యాప్‌లతో మీ ఖాతాను లింక్ చేసి ఉంటే ఇంటర్నెట్ లేకపోయినా మీరు చెల్లింపు చేయవచ్చు. ఇందుకోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా '*99# సేవను ప్రారంభించింది. ఈ పద్ధతిలో మీరు పేమెంట్ చేయాలంటే కింది పద్ధతిని ఫాలో కావాలి.

1)ముందుగా మీ రిజిస్టర్డ్ స్మార్ట్‌ఫోన్ నుంచి *99# డయల్ చేయాలి. ఆ తర్వాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ అడుగుతుంది. దానిని పూరించాలి.

2)ఆ తర్వాత సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, యూపీఐ పిన్ వంటి ఆప్షన్లు ఉంటాయి. మీరు నగదును ఇతరులకు పంపాలనుకుంటే.. డబ్బు పంపేందుకు 1 నంబర్‌ ఎంటర్‌ చేయాలి.

3)అనంతరం మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో ఆ వివరాలను ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేసి ఉన్న లబ్ధిదారుని వివరాలు టైప్‌ చేసి sendపై క్లిక్ చేయాలి.

4)మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే.. ఎవరికి డబ్బులు పంపుతున్నారో ఆ వ్యక్తి యూపీఐ ఖాతాకు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

5)తర్వాత మీరు పంపాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంటర్‌ చేసి పంపాలి. అనంతరం మీ యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసి send ఆప్షన్‌ క్లిక్‌ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్‌ లేకుండా పూర్తవుతుంది.

Updated Date - 2022-11-21T16:31:41+05:30 IST