ఈ సిమ్‌... సంప్రదాయ సిమ్‌లకు టాటా

ABN , First Publish Date - 2022-09-17T08:05:38+05:30 IST

సాధారణంగా సెప్టెంబర్‌ వచ్చిందంటే చాలు, ఐఫోన్‌ హడావిడి ఆరంభమవుతుంది. అమెరికాలో కొన్న ఐఫోన్‌లో సిమ్‌ ట్రే లేకపోవడం సరికొత్త విప్లవం. అంటే సదరు ఐఫోన్‌లో ఫిజికల్‌గా

ఈ సిమ్‌... సంప్రదాయ సిమ్‌లకు టాటా

‘ఈ-సిమ్‌’ లేటెస్ట్‌ ట్రెండ్‌. అంటే సంప్రదాయ సిమ్‌కార్డులతో పని

 ఉండదన్నమాట. ఫోన్‌ కొన్న తరవాత సర్వీస్‌ ప్రొవైడర్‌ దగ్గరికి

 వెళ్లి ఫోన్‌కు ఫిట్‌ అయ్యే సిమ్‌ను తెచ్చుకోవాల్సిన పని ఉండదు. 

ఈ సిమ్‌ కనెక్షన్‌ కోసం జస్ట్‌ కాల్‌ చేస్తే పని అయిపోయింది. 

సాధారణంగా సెప్టెంబర్‌ వచ్చిందంటే చాలు, ఐఫోన్‌ హడావిడి ఆరంభమవుతుంది. అమెరికాలో కొన్న ఐఫోన్‌లో సిమ్‌ ట్రే లేకపోవడం సరికొత్త విప్లవం. అంటే సదరు ఐఫోన్‌లో ఫిజికల్‌గా సిమ్‌కార్డ్‌ ఉండదు. అందుకు బదులు ఈసిమ్‌ను పరిచయం చేసింది. ఫిజికల్‌ సిమ్‌ లేకుండానే డిజిటల్‌ సిమ్‌ కార్డు నేరుగా సెల్యులర్‌ ప్లాన్‌ని కేరియర్‌ నుంచి యాక్టివేట్‌ చేస్తుంది. ఒకేసారి ఎనిమిది అంతకు మించి ఈసిమ్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. అలాగే ఒకేసారి రెండు నంబర్లను ఉపయోగించుకోవచ్చు. ఏతావతా ఇది డ్యూయల్‌ సిమ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో ఫిజికల్‌ సిమ్‌ కార్డు ఉండదు. ఫోన్‌ లేదంటే ఒక్క కాల్‌తో ఈసిమ్‌ సర్వీస్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. అయితే ఇవి ఐఫోన్లకే పరిమితం కాదు. శాంసంగ్‌ సిరీస్‌, ఫ్లిఫ్‌, ఫోల్డ్‌ స్మార్ట్‌ ఫోన్లలోనూ పనిచేస్తుంది. గెలాక్సీ ఎస్‌ 20 నుంచి ఇటీవల విడుదల చేసిన జెడ్‌ ఫోల్డ్‌, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ తదితరాలు అన్నింటిలో ఈసిమ్‌ పనిచేస్తుంది. 


  • ఈ ఏర్పాటుతో అన్నింటి కంటే ముందు సిమ్‌ని డివైస్‌ నుంచి తీసేందుకు సేఫ్టీ పిన్‌ని ఉపయోగించాల్సిన పని ఉండదు. ఫలితంగా నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ని మార్చుకోవడం కూడా సులువుగా ఉంటుంది. అంతా ఒక కాల్‌తో పనవుతుంది. విదేశాలు వెళుతున్నప్పుడు కూడా మల్టిపుల్‌ నెట్‌వర్క్‌ ప్రొఫైల్స్‌ని ఉంచుకోవచ్చు. సిమ్‌కార్డ్‌ పోవడం అన్న సమస్యే తలెత్తదు.
  • స్మార్ట్‌ ఫోన్లను తరచూ మార్చే వ్యక్తులకు చిన్నపాటి సమస్య ఉంటుంది. ప్రతిసారి కాల్‌తో యాక్టివేట్‌ కావాల్సి వస్తుంది. ఎవరో ట్రాక్‌ చేస్తారన్న ఇబ్బంది ఏమీ ఎదురుకాదు. ఐఫోన్‌ 14తో సిమ్‌కార్డులకు స్వస్తి పలికినట్లు అవుతుంది. అమెరికాలో కొన్న ఫోన్‌ మన దేశంలోనూ నిక్షేపంగా పనిచేస్తుంది. అయితే కార్డుపై సేవ్‌ అయిన కాంటాక్ట్‌లు మాత్రం ఈసిమ్‌కు బదిలీ కావు. 

Read more