కొత్త డిజైన్‌తో సోనీ హెడ్‌ఫోన్స్‌

ABN , First Publish Date - 2022-09-24T06:00:13+05:30 IST

సోనీ సరికొత్త హెడ్‌ఫోన్లు ఇండియన్‌ మార్కెట్లోకి వచ్చాయి. డబ్ల్యూహెచ్‌- 1000ఎక్‌ఎం5 పేరిట ఈ నాయిస్‌ కాన్సలింగ్‌ హెడ్‌ఫోన్స్‌ విడుదలయ్యాయి.

కొత్త డిజైన్‌తో సోనీ హెడ్‌ఫోన్స్‌

సోనీ సరికొత్త హెడ్‌ఫోన్లు ఇండియన్‌ మార్కెట్లోకి వచ్చాయి. డబ్ల్యూహెచ్‌- 1000ఎక్‌ఎం5 పేరిట ఈ నాయిస్‌ కాన్సలింగ్‌ హెడ్‌ఫోన్స్‌ విడుదలయ్యాయి. ఇప్పటికే ఆదరణ పొందిన డబ్ల్యూహెచ్‌ 100ఎక్‌ఎం4కి సక్సెసర్‌గా ఇది వచ్చింది. కొత్త డిజైన్‌, స్టెప్‌లెస్‌ స్లయిడింగ్‌ హెడ్‌ఫోన్స్‌, ఇంప్రూవ్డ్‌ ఏఎన్‌సీ, రెండు ప్రాసెసర్లు, ఎనిమిది మైక్రోఫోన్లు తదితరాలన్నీ దీని ప్రత్యేకత. స్టెప్‌లెస్‌ హెడ్‌బ్యాండ్‌ డిజైన్‌కు తోడు సైడ్‌వేస్‌ రొటేటింగ్‌ ఇయర్‌ కప్స్‌ ఉన్నాయి. రైట్‌ ఇయర్‌ కప్‌ - సెన్సిటివ్‌ ఏరియాను టచ్‌ చేస్తుంది. ప్లేబ్యాక్‌ అలాగే  వాల్యూమ్‌ నియంత్రణలోనూ ఇవి కంట్రోలింగ్‌ పవర్‌ కలిగి   ఉంటాయి. రైట్‌ లెఫ్ట్‌ ఇయర్‌ కప్‌లో పవర్‌/పెయిరింగ్‌ బటన్‌, ఏఎన్‌సి బటన్‌, 3.5ఎంఎం ఆడియోజాక్‌ ఉంటాయి. చార్జింగ్‌ కోసం రైట్‌ సైడ్‌ యూఎస్‌బీ-సీ పోర్ట్‌ ఉంది. డ్యూయల్‌ ఇన్‌హౌస్‌ ప్రాసెసర్స్‌  ఉన్నాయి. దీనికున్న 30 ఎంఎం డ్రైవర్‌తో నేచురల్‌ సౌండ్‌ ఔట్‌పుట్‌ సాధ్యం. బ్లూటూత్‌ 5.2ని సపోర్ట్‌ చేస్తుంది. సింగిల్‌ చార్జింగ్‌తో 30 గంటల సేపు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. మూడు నిమిషాల సేపు చార్జింగ్‌తో మూడు గంటల సేపు ఉపయోగించుకోవచ్చు. 

రేటు రూ.34,990 కాగా బ్లాక్‌, సిల్వర్‌ రంగుల్లో వచ్చే నెల 8 నుంచి మన మార్కెట్లో ఇవి లభిస్తాయి. అయితే ఇప్పటి నుంచే ఆర్డర్‌ చేసుకోవచ్చు. అలాంటి వారికి ఇంట్రడక్టరీ ప్రైస్‌ కింద రూ26,990కే లభిస్తుంది. ప్రస్తుతం సోనీ సెంటర్లు, రిటైల్‌ దుకాణాలు, ఈ-కామర్స్‌ పోర్టల్స్‌ నుంచి పొందవచ్చు.

Read more