స్లీప్‌ ట్రాక్‌

ABN , First Publish Date - 2022-09-17T08:12:25+05:30 IST

ఇదే వాచీలో చేసిన మరో అప్డేట్‌ ఇది. నిద్రకు సంబంధించి ఆర్‌ఈఎం, కోర్‌, డీప్‌ స్లీప్‌, అదేవిధంగా స్లీప్‌ సైకిల్‌కు ఈ ఫీచర్‌తో తెలుసుకోవచ్చు

స్లీప్‌ ట్రాక్‌

ఇదే వాచీలో చేసిన మరో అప్డేట్‌ ఇది. నిద్రకు సంబంధించి ఆర్‌ఈఎం, కోర్‌, డీప్‌ స్లీప్‌, అదేవిధంగా స్లీప్‌ సైకిల్‌కు ఈ ఫీచర్‌తో తెలుసుకోవచ్చు. యాక్సిలరోమీటర్‌ నుంచి అందే సిగ్నల్స్‌, హార్ట్‌ రేట్‌ సెన్సర్‌ ఆధారంగా నిద్రపై లోతైన అధ్యయనం చేస్తుంది. అంటే యావత్తు స్లీప్‌ డేటాని యూజర్‌ పొందవచ్చు. విండ్‌ డౌన్‌, బెడ్‌టైమ్‌ షెడ్యూల్స్‌ని కూడా యాపిల్‌ స్లీప్‌ యాప్‌ యూజర్లు పొందవచ్చు. యాపిల్‌ ఐడి అకౌంట్‌తోనూ సింక్రనైజ్‌ కావచ్చు. యాపిల్‌ వాచీలో ఎప్పటినుంచో స్లీప్‌ యాప్‌ ఉంది. అయితే దీంట్లో మరింత వివరంగా విశ్లేషణ ఉంటుంది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8, వాచ్‌ ఎస్‌ఈ సెకెండ్‌ జనరేషన్‌, యాపిల్‌ వాచ్‌ అలా్ట్రలో వాచ్‌ ఓఎస్‌ 9 అప్డేట్‌ పొందవచ్చు.


అయితే ఇతర ఫిట్‌నెస్‌ వాచీల మాదిరిగా యాపిల్‌ వాచీ ఆటోమేటిక్‌గా డిటెక్ట్‌ చేయలేదు. స్లీప్‌ మోడ్‌ను యాక్టివేట్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్‌ స్లీప్‌ షెడ్యూల్‌ని ట్రాక్‌ చేయవచ్చు. ఒకసారి నిద్ర నుంచి లేచిన తరవాత స్లీప్‌ మోడ్‌ డిజేబుల్‌ అవుతుంది. అప్పుడు యాపిల్‌ వాచీలోని స్లీప్‌ యాప్‌ని చూస్తే సంబంధిత అనాల్సిస్‌ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా ఐఫోన్‌లోనూ యాప్‌ని ఓపెన్‌ చేసుకుని వివరాలను చెక్‌ చేసుకోవచ్చు. 

Read more