గూగుల్‌తో షాపింగ్‌ ఈజీ

ABN , First Publish Date - 2022-10-01T06:09:54+05:30 IST

ఇవాళ ఏ పనిచేయాలన్నా గూగుల్‌ సహాయం కావాల్సిందే. కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ కావాలన్నా కేరాఫ్‌ అడ్రస్‌ గూగుల్‌నే.

గూగుల్‌తో షాపింగ్‌ ఈజీ

వాళ ఏ పనిచేయాలన్నా గూగుల్‌ సహాయం కావాల్సిందే. కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ కావాలన్నా కేరాఫ్‌ అడ్రస్‌ గూగుల్‌నే. తాజాగా షాపింగ్‌ చేయడంలో కూడా గూగుల్‌ హెల్ప్‌ చేయనుంది. షాపింగ్‌ను సులువు చేసేందుకు తాజాగా కొత్త ఫీచర్లను అందిస్తోంది. తన ‘షాపింగ్‌ గ్రాఫ్‌’ను ఉపయోగించుకునేందుకు తొమ్మిది మార్గాలను ప్రకటించింది. ఏఐ-ఎన్‌హాన్స్‌డ్‌ మోడల్‌ కాగా బెటర్‌ షాపింగ్‌ అనుభవానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్‌గా ‘షాప్‌’ అలాగే కొనాలని అనుకుంటున్న ప్రొడక్ట్‌ టైప్‌ చేస్తే చాలు, మొత్తం విజువల్‌ ఫీడ్‌ కనిపిస్తుంది. దీన్ని మొదట అమెరికాలోని మొబైల్‌ డివైస్‌లకు అందిస్తున్నారు. తదుపరి దశలో మిగతా ప్రాంతాలకూ విస్తరించనున్నారు. 


మరో ఫీచర్‌ ‘షాప్‌ ద లుక్‌’. దీనితో ఉదాహరణకు ఒక జాకెట్‌ కోసం వెతుకుతుంటే అనుబంధంగా ఉండే పీసుల ఇమేజెస్‌, కొనుగోలు ఆప్షన్స్‌ కూడా కనిపిస్తాయి. ‘సీ వాట్‌ ఈజ్‌ ట్రెండింగ్‌’ ఫీచర్‌లో పేరుకు తగ్గట్టే పాపులర్‌ ప్రొడక్ట్‌లు కనిపిస్తాయి. 3డి షాపింగ్‌ మరొకటి. వ్యయభరిత 3డి మోడల్స్‌ను గూగుల్‌ క్రియేట్‌ చేసింది. మెషీన్‌ లెర్నింగ్‌ సహాయంలో మరిన్ని 3డి మోడల్స్‌ను చూసే అవకాశం యూజర్లకు కలుగుతుంది. బెటర్‌ షాపింగ్‌ కోసం బయింగ్‌ గైడ్‌  ఇంటిగ్రేషన్‌ మరొకటి. విశ్వసనీయ సమాచారంతో షాపింగ్‌ పేజీ ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా బైక్‌ కొనాలని అనుకుంటే ఇందులో సైజ్‌, వెయిట్‌ తదతర వివరాలు అన్నీ కనిపిస్తాయి. పర్సనలైజ్డ్‌ ఫలితాలకు వెసులుబాటు అలాగే షాపింగ్‌ ఫిల్టర్స్‌ తదితరాలను కూడా జతచేసి షాపింగ్‌ ప్రక్రియను మరింత లాభసాటిగా యూజర్లకు గూగుల్‌ అందిస్తోంది. 

Read more