Instagramలో చికాకు తెప్పిస్తున్న కొత్త ఫీచర్..! ఇలా సింపుల్‌గా..

ABN , First Publish Date - 2022-11-23T20:05:54+05:30 IST

తొలుత ఈ ఫీచర్ యూజర్లకు కొత్తగా అనిపించినా.. ప్రస్తుతం(Instagram notes) చికాకు తెప్పిస్తోంది. దీంతో ఇతరుల ‘నోట్స్’ కనిపించకుండా ఉండేందుకు మ్యూట్ ఆప్షన్(Mute Instagram notes) కోసం..

Instagramలో చికాకు తెప్పిస్తున్న కొత్త ఫీచర్..! ఇలా సింపుల్‌గా..

ఇంటర్నెట్ డెస్క్: పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఇన్‌స్ట్రాగ్రామ్ కూడా ఒకటి. కొద్ది రోజుల క్రితం యూజర్ల కోసం Instagram ‘నోట్స్’ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 60 క్యారెక్టర్స్ మించకుండా ఈ ‘నోట్స్’ పీచర్ ద్వారా యూజర్లకు తమ అభిప్రాయాలు, ఆలోచనలను టెక్స్ట్ రూపంలో పెట్టే సౌలభ్యం కల్పించింది. తొలుత ఈ ఫీచర్ యూజర్లకు కొత్తగా అనిపించినా.. ప్రస్తుతం(Instagram notes) చికాకు తెప్పిస్తోంది. దీంతో ఇతరుల ‘నోట్స్’ కనిపించకుండా ఉండేందుకు మ్యూట్ ఆప్షన్(Mute Instagram notes) కోసం తెగ సర్చ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూట్ ఆప్షన్‌ను ఎలా ఎనబుల్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

  • ఏ Insta యూజర్ నోట్స్‌ను మీరు మ్యూట్ చేయాలి అనుకుంటున్నారో.. సదరు యూజర్ నోట్స్‌ను తొలుత ఓపెన్ చేయాలి.

  • తర్వాత ఆ నోట్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే.. ఒక మెనూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది.

  • అందులో ‘మ్యూట్ నోట్స్’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

  • అలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనల్ని కన్‌ఫర్మేషన్ అడుగుంది.

ఇలా ‘నోట్స్’ ద్వారా కాకుండా డైరెక్ట్ యూజర్ ప్రొఫైల్‌‌ను ఓపెన్ చేసి కూడా సదరు యూజర్‌కు సంబంధించిన ‘నోట్స్’ మనకు కనిపించకుండా మ్యూట్ చేయవచ్చు. ఇందు కోసం ముందుగా.. మనం ఏ యూజర్ ప్రొఫైల్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మెసేజ్ బటన్‌ పక్కనే ఉన్న ఫాలోయింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మ్యూట్‌ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా సదరు యూజర్ పోస్టులు, స్టోరీలను మ్యూట్‌లో పెట్టొచ్చు.

Updated Date - 2022-11-23T20:16:14+05:30 IST