స్పెల్‌ చెక్‌తో పాస్‌వర్డ్‌ లీక్‌!

ABN , First Publish Date - 2022-09-24T06:46:30+05:30 IST

ఏదో చేయబోతే మరేదో అయ్యిందని సామెత. డ్రాఫ్ట్‌లో తప్పులు లేకుండా చూసుకోడానికి స్పెల్‌ చెక్‌ని ఆశ్రయిస్తే, అది కాస్తా పాస్‌వర్డ్‌ లీక్‌కు దారితీస్తోందని రుజువు అవుతోంది.

స్పెల్‌ చెక్‌తో పాస్‌వర్డ్‌ లీక్‌!

ఏదో చేయబోతే మరేదో అయ్యిందని సామెత. డ్రాఫ్ట్‌లో తప్పులు లేకుండా చూసుకోడానికి స్పెల్‌ చెక్‌ని ఆశ్రయిస్తే, అది కాస్తా పాస్‌వర్డ్‌ లీక్‌కు దారితీస్తోందని రుజువు అవుతోంది. ల్యాప్‌టాప్‌ల్లో అదేపనిగా టైపింగ్‌ చేసే వ్యక్తులు తప్పనిసరిగా స్పెల్‌చెక్‌నూ పెట్టుకుంటారు. వ్యాసాలు, డాక్యుమెంట్లను టైప్‌ చేసుకునేటప్పుడు తప్పులు దొర్లకుండా అది కాపాడుతుంది. తప్పును గుర్తించడమే కాదు, ఆటోమేటిక్‌గా కరెక్షన్‌ కూడా చేస్తుంది. బ్రౌజర్‌లో స్పెల్‌చెక్‌ ఎక్స్‌టెన్షన్స్‌ను అందుకోసం ఉంచుకోవడం రివాజు. అయితే జావాస్ర్కిప్ట్‌ సెక్యూరిటీ నివేదిక ప్రకారం స్పెల్‌చెక్‌ ఎక్స్‌టెన్షన్‌ కారణంగా సెన్సిటివ్‌ డేటా కాస్తా మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ దగ్గరకు వెళుతోంది. ఒక టెస్ట్‌ రన్‌లో లీక్‌ అవుతున్నట్టు సంస్థ బాధ్యులు కూడా కనుగొన్నారు. స్పెల్‌చెక్‌ టర్న్‌ ఆన్‌లో ఉంటే చాలు,  సమాచారాన్ని ఎంటర్‌ చేసిన వెంటనే అది మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌కు చేరుతోంది. ఏతావతా లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ సైతం సేఫ్‌ కాదని ఈ సంఘటన రుజువు చేస్తోంది. అయితే ఈ సమస్య నుంచి బైటపడేందుకు తరుణోపాయం ఉంది. బ్రౌజర్‌లో స్పెల్‌చెక్‌ మాన్యువల్‌ అయిన పక్షంలో  అది టర్న్‌డ్‌ ఆఫ్‌లో ఉంటుంది. దాంతో యూజర్‌ సమాచారం సేఫ్‌గా ఉంటుంది. ఒకవేళ ఆన్‌లో ఉన్నప్పటికీ టర్నాఫ్‌ అంటే దాన్ని తొలగించాలి. నేటివ్‌ స్పెల్‌ చెక్‌ ఫీచర్‌ అనేది గూగుల్‌ క్రోమ్‌ లేదా మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌లో ఉంటే చాలు సెట్టింగ్స్‌ నుంచి దాన్ని టర్నాఫ్‌ చేసుకోవచ్చు. అలాక్కూడ యూజర్‌ తన సెన్సిటివ్‌ సమాచారం లీక్‌ కాకుండా చూసుకోవచ్చు.  

Read more