గూగుల్‌ మ్యాప్స్‌కు చిరునామాల జత

ABN , First Publish Date - 2022-09-24T06:47:15+05:30 IST

గూగుల్‌ మ్యాప్స్‌ మరో కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో ఇప్పటికే లొకేషన్‌ తెలుసుకోవడమే కాదు

గూగుల్‌ మ్యాప్స్‌కు చిరునామాల జత

గూగుల్‌ మ్యాప్స్‌ మరో కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో ఇప్పటికే లొకేషన్‌ తెలుసుకోవడమే కాదు, బిజీ ఏరియాలను తప్పించుకోవడం, టోల్‌ ధరల చెకింగ్‌ తదితర వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నాం. తాజాగా మరో సౌలభ్యాన్ని అంటే ఇల్లు, ఆఫీసు సహా కొన్ని ప్రదేశాలకు తరుచూ వెళ్ళాల్సి ఉంటుంది. పదేపదే వెళ్ళే ఆ చిరునామాలను కూడా గూగుల్‌ మ్యాప్స్‌కు జతచేయ వచ్చు. దీంతో లొకేషన్‌ కోసంసెర్చ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.  సమయం కూడా ఆదా అవుతుంది. సదరు పేర్లతో సులువుగా సెర్చ్‌ చేసుకోవచ్చు. అయితే గూగుల్‌ మ్యాప్స్‌లో స్టోర్‌ చేసుకున్న కాంటాక్టులకు మాత్రమే ఈ సేవ పరిమితం. దీనికోసం...


ఆండ్రాయిడ్‌ డివైస్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసుకోవాలి. 

ఒక అడ్రస్‌ కోసం సెర్చ్‌ చేయాలి

అడ్రస్‌ బాటమ్‌లో టాప్‌ చేయాలి.

లేబుల్‌ ఆప్షన్‌ను టాప్‌ చేయాలి.

గూగుల్‌ అకౌంట్‌లో సేవ్‌ చేసిన పేరును అక్కడ ఎంటర్‌ చేయాలి. సేవ్‌ చేయని పక్షంలో క్రియేట్‌ కాంటాక్ట్‌ ఆప్షన్‌ను టాప్‌ చేయాలి.

కాంటాక్ట్‌లో ఉన్న చిరునామా హోమ్‌ సహా ఏదైనా కలిపేందుకు సదరు ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయాలి(న్యూ లేబుల్‌ని క్రియేట్‌ చేసుకోవాలి)

అలాగే గూగుల్‌ మ్యాప్స్‌లో సేవ్‌ చేసిన చిరునామాల్లో మార్పులు చేసుకోవచ్చు. తొలగించవచ్చు లేదా దాచిపెట్ట వచ్చు కూడా.

Read more