ఒప్పో ఎ17 వచ్చేసింది

ABN , First Publish Date - 2022-10-08T10:05:45+05:30 IST

6.56 ఇంచీల హెచ్‌డి స్ర్కీన్‌కు 5 ఎంపీ ఫ్రంట్‌ హౌస్‌ కెమెరా దీనికి ఉన్నాయి. 1612 ్ఠ 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ని ఇస్తోంది.

ఒప్పో ఎ17 వచ్చేసింది

చైనాకు చెందిన ఒప్పో తన బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను విస్తరిస్తోంది. ఎ సిరీస్‌లో తాజాగా  ‘ఒప్పో ఎ17’ని భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 

6.56 ఇంచీల హెచ్‌డి స్ర్కీన్‌కు 5 ఎంపీ ఫ్రంట్‌ హౌస్‌ కెమెరా దీనికి ఉన్నాయి. 1612 ్ఠ 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ని ఇస్తోంది. 12ఎన్‌ఎం ఆక్టాకోర్‌ మీడియోటెక్‌ హీలియో జీ35 చిప్‌సెట్‌, ఐఎంజీ పవర్‌వీఆర్‌ జీఈ8320 జీపీయు పవర్‌ కలిగి ఉంది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డుతో 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంది. 500ఎంఎహెచ్‌ బ్యాటరీకి తోడు చార్జింగ్‌ కోసం యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ ఉంది. దీని రేటు రూ.12,499 కాగా సన్‌లైట్‌ ఆరెంజ్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో లభ్యమవుతోంది. 

Read more