వాట్సాప్‌లో స్ర్కీన్‌షాట్లకు నో!

ABN , First Publish Date - 2022-10-08T10:16:50+05:30 IST

వాట్సాప్‌ మరో ఫీచర్‌పై పని చేస్తోంది.

వాట్సాప్‌లో స్ర్కీన్‌షాట్లకు నో!

వాట్సాప్‌ మరో ఫీచర్‌పై పని చేస్తోంది. ‘వ్యూ వన్స్‌’ కింద షేర్‌ చేసిన ఫొటోలు, వీడియోల స్ర్కీన్‌షాట్‌ తీసే వీలు ఈ ఫీచర్‌ కారణంగా ఉండదు. వాస్తవానికి వ్యూ వన్స్‌ కింద పంపిన మీడియా ఫైల్స్‌ ఒకసారి చూడగానే అదృశ్యమవుతాయి. అయితే అప్పటికప్పుడు వాటిని స్ర్కీన్‌షాట్‌ తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకు ఉంది. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో ఆ అవకాశం కూడా ఉండదు. వాట్సాప్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ 2.22.22.3తో ఆండ్రాయిడ్‌ బేటా, ఐఔస్‌ బేటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను పంపినట్టు డబ్ల్యుఎబేటాఇన్ఫో పేర్కొంది. యూజర్ల ఫొటోలు, వీడియోలకు సెక్యూరిటీ మరింతగా కల్పించేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. అలాగే అప్పటికీ స్ర్కీన్‌షాట్‌ తీసుకున్నప్పటికీ అది బ్లాంక్‌ లేదా బ్లాక్‌గా కనిపిస్తుంది. అలాగే ఆన్‌లైన్‌ స్టాటస్‌ను ఎవరు చూడచ్చు, మరెవరు చూడకూడదని ఎంచుకునే వెసులుబాటును ఇప్పటికే యూజర్లకు వాట్సాప్‌ అందించింది. 

Updated Date - 2022-10-08T10:16:50+05:30 IST