పిక్సెల్‌ 6 సిరీస్‌కు న్యూ వెర్షన్‌

ABN , First Publish Date - 2022-12-10T11:40:24+05:30 IST

పిక్సెల్‌ 6 సిరీస్‌కు కెమెరా యాప్‌నకు సంబంధించి గూగుల్‌ న్యూ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. ఈ అక్టోబరులో 7 సిరీస్‌కు అప్డేట్స్‌ తెచ్చిన విషయం

పిక్సెల్‌ 6 సిరీస్‌కు న్యూ వెర్షన్‌

పిక్సెల్‌ 6 సిరీస్‌కు కెమెరా యాప్‌నకు సంబంధించి గూగుల్‌ న్యూ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. ఈ అక్టోబరులో 7 సిరీస్‌కు అప్డేట్స్‌ తెచ్చిన విషయం విదితమే. పిక్సె 6 ప్రొలో ఈ అప్డేట్‌ను ఇప్పటికే గుర్తించారు. కొత్త వెర్షన్‌ పిక్సెల్‌ 4, పిక్సెల్‌ 4ఎకు కూడా వర్తిస్తుంది. పిక్సెల్‌ 7కి ఇచ్చిన సూట్‌ మాదిరిగానే ఈ అప్డేట్స్‌ ఉంటాయని అంటున్నారు. 1ఎక్స్‌ - 2ఎక్స్‌ మధ్య జూమ్‌ కోసం యాప్‌లోని వ్యూఫైండర్‌ని డబుల్‌ టాప్‌ చేయాల్సి ఉంటుంది. మే నెలలో తీసేసిన ఫేసెస్‌ ఫీచర్‌ కూడా దీంతో వస్తోంది. పిక్చర్స్‌ని ఎక్కడ సేవ్‌ చేసుకోవాలన్నది కూడా సులువు కానుంది. ఆఖరు ఫొటో సేవ్‌ అయిందీ లేనిదీ తెలుసుకోవడానికి ప్రివ్యూని లాంగ్‌ ప్రెస్‌ చేస్తే చాలు.

Updated Date - 2022-12-10T11:40:25+05:30 IST