టాస్క్‌ మేనేజర్‌కు కొత్తందాలు

ABN , First Publish Date - 2022-06-11T05:48:40+05:30 IST

మైక్రోసాఫ్ట్‌ తాజాగా చేస్తున్న మార్పుల్లో భాగంగా టాస్క్‌ మేనేజర్‌కు కొత్త సొబగులను సమకూరుస్తోంది.

టాస్క్‌ మేనేజర్‌కు కొత్తందాలు

మైక్రోసాఫ్ట్‌ తాజాగా చేస్తున్న మార్పుల్లో భాగంగా టాస్క్‌ మేనేజర్‌కు కొత్త సొబగులను సమకూరుస్తోంది. విండోస్‌ 11 వెర్షన్‌ 22హెచ్‌2 అతి పెద్ద కాస్మొటిక్‌ అప్‌డేట్‌ కాగా దీంతో టాస్క్‌ మేనేజర్‌ ఇంతకుమునుపు కంటే మెరుగ్గా కనిపిస్తుంది. ఈ మార్పులు  రాబోయే నెలల్లో అమలు కానున్నాయి. అయితే యూసేజ్‌కు సంబంధించిన విధుల్లో ఎలాంటి మార్పూ లేదు. మార్పు అంతా లుక్‌లోనే. లేఔట్‌ మారింది. లెఫ్ట్‌ కాలమ్‌లో ట్యాబ్స్‌ని చూడచక్కగా అమర్చారు. విండోస్‌లో ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్స్‌ మాదిరిగా కనిపిస్తోంది. డార్క్‌మోడ్‌ కూడా వచ్చింది. డేటాపై ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. సరికొత్త ఎఫిసియెన్సీ మోడ్‌ ఫలితంగా నిర్దేశిత ప్రోగ్రామ్‌లకు సిస్టమ్‌ రిసోర్స్‌ను పరిమితంగా వాడుకోవచ్చు. దీంతో బ్యాటరీ లైఫ్‌ ఆదా అవుతుంది. మొబైల్‌ డివైస్‌ల్లో ఇది చాలా ఉపయోగకరం. 

Updated Date - 2022-06-11T05:48:40+05:30 IST