డేటా స్పీడులో కొత్త రికార్డ్.. ఒకేసారి కోటి వీడియోలు

ABN , First Publish Date - 2022-06-07T19:53:59+05:30 IST

కొత్త డేటా ట్రాన్స్‌మిషన్ స్పీడ్ రికార్డ్‌లోని మరో విశేషమైన అంశం ఏంటంటే, ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రస్తుతం ఉపయోగిస్తున్న వాటికి భిన్నంగా లేని ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ని ఉపయోగించి పరిశోధకులు ఈ ఘనత సాధించారు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం, అదే ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు ప్రస్తుతం..

డేటా స్పీడులో కొత్త రికార్డ్.. ఒకేసారి కోటి వీడియోలు

టోక్యో: టెక్నాలజీ నిమిషాల్లో అనేక రెట్ల వేగానికి ప్రపంచం అభివృద్ధి చెందుతోంది. తాజా ఒక పరిశోధనలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ని అభివృద్ధి చేశారు. ఎంత వేగం అంటే ఒక సెకనులో ఒక కోటి వీడియోలను ఒకేసారి రికార్డ్ చేయవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి చేసిన డేటా వేగం సెకనుకు 1.02 పెటాబైట్స్. వెయ్యి టెరాబైట్లుకు సమానమైన వేగం ఇది. జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఎన్ఐసీటీ) ఈ టెక్నాలజీని ఈ ఘనత సాధించింది. దీని ట్రాన్స్‌ఫార్మింగ్ డేటా 57.7 కిలోమీటర్ల సామర్థ్యం ఉంటుందని ఎన్ఐసీటీ పేర్కొంది.


కొత్త డేటా ట్రాన్స్‌మిషన్ స్పీడ్ రికార్డ్‌లోని మరో విశేషమైన అంశం ఏంటంటే, ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రస్తుతం ఉపయోగిస్తున్న వాటికి భిన్నంగా లేని ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ని ఉపయోగించి పరిశోధకులు ఈ ఘనత సాధించారు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం, అదే ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు ప్రస్తుతం అభివృద్ధి చేసిన డేటా స్పీడులో మూడో వంతు వేగాన్ని మాత్రమే పొందుతున్నారు. సాంకేతికతాభివృద్ధిలో వస్తున్న వినూత్న మార్పుకు వేగానికి ఇది నిదర్శనమని పరిశోధకులు అంటున్నారు. ఈ విధమైన వేగంతో భవిష్యత్‌లో మరింత సులభంగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-06-07T19:53:59+05:30 IST