కొత్త ఫీచర్లు!

ABN , First Publish Date - 2022-02-19T05:30:00+05:30 IST

వాట్సాప్‌ రెగ్యులర్‌, బిజినెస్‌ వెర్షన్లకు కొత్త ఫీచర్లు కొన్నింటిని

కొత్త ఫీచర్లు!

వాట్సాప్‌ రెగ్యులర్‌, బిజినెస్‌ వెర్షన్లకు కొత్త ఫీచర్లు కొన్నింటిని జతచేసే పనిలో ఉంది. రాబోయే అప్‌డేట్‌తో కమ్యూనిటీలను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందులో గ్రూప్‌ అడ్మిన్‌లకు మరికొంత కంట్రోల్‌ ఉంటుంది. గ్రూప్‌లను లింక్‌ చేసే అధికారం కూడా ఉంటుంది. 


బిజినెస్‌ వెర్షన్‌లో తమ ప్రొఫైల్‌కు కవర్‌ ఫొటోను జతచేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్‌ అకౌంట్లకు విడుదల చేయకపోవచ్చు. బిజినెస్‌ అకౌంట్‌లో కెమెరా బటన్‌ కుడి వైపు ఉంటుంది. కవర్‌ ఫొటో అన్ని అకౌంట్ల వారికి కనిపిస్తుంది. ఐఓఎస్‌లో ఈ ఫీచర్‌ కనిపిస్తోంది.

Read more