ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కొత్త ఫీచర్లు

ABN , First Publish Date - 2022-02-19T05:30:00+05:30 IST

వినియోగదారుల సేఫ్టీ, ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కొత్త ఫీచర్లు

వినియోగదారుల సేఫ్టీ, ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని ఫొటో యాప్‌ - ఇన్‌స్టాగ్రామ్‌ కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.  ‘యువర్‌ యాక్టివిటి’ ఫీచర్‌కి కొత్తగా కామెంట్లు, పోస్టులను డిలీట్‌ చేసే సౌలభ్యాన్ని కూడా చేర్చింది. బల్క్‌ అంటే ఒకేసారి పెద్ద సంఖ్యలో వాటన్నింటినీ డిలీట్‌ చేసేయవచ్చు. మరిన్ని అకౌంట్‌ కంట్రోల్స్‌ తద్వారా పెద్ద మొత్తంలో డిలీట్‌కు అవకాశం కల్పించింది. యువర్‌ యాక్టివిటితో ఇకపై సరికొత్త అనుభవం వినియోగదారులకు మిగులుతుందని ఇన్‌స్టాగ్రామ్‌ ఒక ట్వీట్‌లో  పేర్కొంది.  అలాగే ఆర్కైవ్‌లోకే పంపే అవకాశం కూడా ఉంటుంది. ఆర్కైవ్‌లోకి పంపిన, ఇటీవల డిలీట్‌ చేసిన, సెర్చ్‌ హిస్టరీ వంటి సదుపాయాలు కూడా కొత్త జోడింపుతో కలుగుతాయి. 


యువర్‌ యాక్టివిటీ కోసం యూజర్లు ప్రొఫైల్‌లోకి వెళ్ళి, మెనూ సెక్షన్‌పై టాప్‌ చేయాలి. అప్పర్‌ రైట్‌ కార్నర్‌లో ఈ ఆప్షన్స్‌ అన్నీ కనిపిస్తాయి. అలాగే ఈ నెల మొదట్లో ‘టేక్‌ ఏ బ్రేక్‌’ ఫీచర్‌ను విడుదల చేసింది. దీంతో యూజర్లు రిమైండర్లు పెట్టవచ్చు. దాంతో కొంత కాలం స్ర్కోలింగ్‌ తరవాత బ్రేక్‌ తీసుకోవచ్చు. 


Read more