ఐఫోన్‌ 15 ఫీచర్స్‌ లీక్‌!

ABN , First Publish Date - 2022-10-01T06:11:26+05:30 IST

వచ్చే ఏడాది విడుదల కానున్న ఐఫోన్‌ 15 ఫీచర్స్‌ అప్పుడే బైటపడ్డాయి.

ఐఫోన్‌ 15 ఫీచర్స్‌ లీక్‌!

చ్చే ఏడాది విడుదల కానున్న ఐఫోన్‌ 15 ఫీచర్స్‌ అప్పుడే బైటపడ్డాయి. ఐఫోన్‌ 14 విడుదలై కొద్ది రోజులు కూడా గడవకముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఐఫోన్‌ 15 అలా్ట్రలో రెండు ఫ్రంట్‌ కెమెరాలు ఉంటాయని సమాచారం. 256 జీబీతో ఆరంభమవుతాయని కూడా అంటున్నారు. ఐఫోన్‌ 15 ప్రొ మాక్స్‌ ఉండబోదన్న పుకారు వచ్చిన కొద్ది రోజులకే ఈ విషయం ప్రచారంలోకి వచ్చింది. ఐఫోన్‌ 14 మినికి మాదిరిగా దాని స్థానే ఐఫోన్‌ 15 అలా్ట్ర వస్తుందని అంటున్నారు. యాపిల్‌ వాచ్‌ అలా్ట్ర కొద్ది వారాల క్రితమే విడుదలైంది. అలాగే చార్జింగ్‌ విషయంలో ప్రొ - నాన్‌ ప్రొ మోడల్స్‌ మధ్య పెద్ద తేడా ఉండదు. యూఎస్‌బీ సి మాత్రం 15 మోడల్స్‌కు ఉపయోగపడేలా వస్తోంది. ఐఫోన్‌ వినియోగదారులకు ఇదో ఉమ్మడి ప్రయోజనం కానుంది. 

Read more