iOS 16: వస్తూవస్తూ బోల్డన్ని ఫీచర్లను మోసుకొచ్చిన ఐవోఎస్ 16

ABN , First Publish Date - 2022-09-14T03:03:00+05:30 IST

యాపిల్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐవోఎస్ 16(iOS 16) ఎట్టకేలకు వచ్చేసింది. వస్తూవస్తూ బోల్డన్ని ఫీచర్లను మోసుకొచ్చింది

iOS 16: వస్తూవస్తూ బోల్డన్ని ఫీచర్లను మోసుకొచ్చిన ఐవోఎస్ 16

న్యూఢిల్లీ: యాపిల్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐవోఎస్ 16(iOS 16) ఎట్టకేలకు వచ్చేసింది. వస్తూవస్తూ బోల్డన్ని ఫీచర్లను మోసుకొచ్చింది. సోమవారం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఓఎస్ తొలుత యూఎస్ యూజర్లకు అప్‌డేట్ అయింది. తాజాగా, భారత్‌లోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అండ్ అప్‌డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. కొత్తది అందుబాటులో లేకుంటే పాత ఓఎస్‌నే చూపిస్తుంది. 


 ఐవోఎస్ 16ను ఏయే ఫోన్లలో అప్‌డేట్ చేసుకోవచ్చంటే?

యాపిల్ కొత్త ఓఎస్ ఐఫోన్ 8 సిరీస్ ఫోన్లు, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ మ్యాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ (2020), ఐఫోన్ ఎస్ఈ (2021) ఫోన్లలో ఐవోఎస్ 16 అప్‌డేట్ అవుతుంది. యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 14 సిరీస్‌ ఫోన్లు కొత్త ఐవోఎస్‌తోనే వచ్చాయి.


ఐవోఎస్ 16 ఫీచర్లు

వాల్‌పేపర్‌ను చాలా సింపుల్‌గా స్వైప్ చేయడం ద్వారా మార్చుకోవచ్చు. డుయో టోన్, కలర్ వాష్, బ్లాక్ అండ్ వైట్, నేచురల్ వంటి ఫిల్టర్లను జోడించుకోవచ్చు. నోటిఫికేషన్లు లాక్ స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. కింది నుంచి పైకి స్వైప్ చేయడం ద్వారా దీనిని యాక్సెస్ చేసుకోవచ్చు. పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. అన్‌సెండ్ కూడా చేసుకోవచ్చు. మెసేజ్ పంపిన పావుగంట లోపు ఎడిట్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపిన రెండు నిమిషాల తర్వాత కూడా అన్‌సెండ్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపిన తర్వాత దానిపై ట్యాప్ చేస్తే ఎడిట్, అన్‌డూ సెండ్ ఆప్షన్లు కనిపిస్తాయి. అయితే, ఐదుసార్లకు మించి ఎడిట్ చేయడానికి కుదరదు. అంతేకాదు, మెసేజ్ అందుకున్న వారికి కూడా ఎడిట్ రికార్డు కనిపిస్తుంది.


ఐవోఎస్ 16 అప్‌డేట్‌తో  లైవ్ టెక్స్ట్ ఫీచర్ అప్‌డేట్ అయింది. లైవ్ టెక్స్ట్ ఇప్పుడు సిస్టమ్‌లోని వీడియోలలో ఉన్న టెక్ట్స్‌ను గుర్తించగలదు. వినియోగదారులు టెక్స్ట్‌తో ఇంటరాక్ట్ కావడానికి ఏ ఫ్రేమ్‌లోనైనా వీడియోను పాజ్ చేయవచ్చు. కాపీ చేసి పేస్ట్ చేయడం, అనువదించడం, కరెన్సీని మార్చడంతో పాటు మరెన్నో ఫీచర్లు కొత్త ఓఎస్‌లో ఉన్నాయి. అలాగే, సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం ‘లాక్‌డౌన్ మోడ్’ను తీసుకొచ్చింది. ఇది పెగాసస్ వంటి స్పైవేర్‌ల నుంచి ఫోన్‌కు రక్షణ కల్పిస్తుంది. సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ట్యాబ్‌కు వెళ్లి ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. 

Updated Date - 2022-09-14T03:03:00+05:30 IST