Smartphone: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. దేశంలో ఏ ట్రాఫిక్ పోలీసు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు!

ABN , First Publish Date - 2022-12-04T11:24:38+05:30 IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చట్టాలు కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనంపై బయటికి వెళ్లాలంటే.. డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్ వంటి ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పొరపాటున వాటిని ఇంట్లో...

Smartphone: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. దేశంలో ఏ ట్రాఫిక్ పోలీసు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చట్టాలు కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనంపై బయటికి వెళ్లాలంటే.. డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్ వంటి ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పొరపాటున వాటిని ఇంట్లో మరిచిపోయి.. రోడ్డెక్కితే చలాన్లు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగని అదే పనిగా గుర్తుంచుకుని మరీ వాటిని ప్రతిసారి క్యారీ చేయడం కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. ఈ క్రమంలో ఓ చిన్న పని చేయడం ద్వారా.. ట్రాఫిక్ పోలీసులు విధించే చలానాల నుంచి శాశ్వతంగా తప్పించుకోవచ్చు. ఆ డాక్యుమెంట్లను క్యారీ చేయకుండానే దేశం మొత్తం హ్యాపీగా తిరిగేయవచ్చు. అది ఎలా అంటారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

ఇందుకోసం మొదటగా స్మార్ట్‌ఫోన్ ఉండాలి. స్మార్ట్‌ఫోన్‌లో డిజీలాకర్( Digilocker) లేదా ఎంపరివాహన్(mParivahan)‌యాప్ లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ వంటి సర్టిఫికెట్‌లను ఆ యాప్‌లలో డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న సాఫ్ట్ కాపీలు చెల్లుబాటు అవుతాయి. పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆ సాఫ్ట్‌కాపీలను చూపిస్తే సరిపోతుంది. హార్డ్ కాపీలను క్యారీ చేయకుండా.. కేవలం సాఫ్ట్ కాపీల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రయాణం చేయవచ్చు. చలాన్లు అస్సలు పడవు. 2018లోనే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. డిజీలాకర్, ఎంపరివాహన్ యాప్‌లలో సేవ్ చేసుకున్న ధ్రువపత్రాలను.. ఒరిజినల్ డాక్యుమెంట్ల‌లానే పరిగణించాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-12-04T11:38:07+05:30 IST