హువాయ్‌ కొత్త స్పీకర్‌

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

ఒక రోజుకు మించి అంటే ఇరవై ఆరుగంటల సేపు ప్లేబాక్‌ టైమ్‌ కలిగిన

హువాయ్‌ కొత్త స్పీకర్‌

ఒక రోజుకు మించి అంటే ఇరవై ఆరుగంటల సేపు ప్లేబాక్‌ టైమ్‌ కలిగిన స్మార్ట్‌ స్పీకర్‌ని హువాయ్‌ విడుదల చేసింది. ‘ఎండబ్ల్యూసీ 2022’ పేరిట లేటెస్ట్‌ ఎడిషన్‌ మార్కెట్‌కు వచ్చింది. ఫ్రెంచ్‌ ఆడియో బ్రాండ్‌ డెవియలెట్‌తో కలిసి దీన్ని రూపొందించింది. సిలిండర్‌ ఆకారం బాడీతో రూపొందిన దీన్లో నాలుగు స్పీకర్‌ యూనిట్లు ఉన్నాయి. ఐపీ67 రేటింగ్‌, దూళి అలాగే నీటి నిరోధకంగా రూపొందించారు. హువాయ్‌ వాచీని ఉపయోగించి వాల్యూమ్‌ని కంట్రోల్‌ చేసుకోవచ్చు. ట్రాక్స్‌ని తప్పించుకోవచ్చు. ఇన్‌బిల్ట్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ సహకారంతో రిమైండర్స్‌, మెమోలు, సమాచారానికి ఎంక్వయిరీలు చేసుకోవచ్చు. 149 యూరోలు అంటే మన కరెన్సీలో సుమారు రూ.12,600కి లభిస్తుంది. యురోపియన్‌ దేశాలకు తోడు చిలీ, పెరూలో ఇది లభిస్తుంది. ఒబ్సిడియన్‌ బ్లాక్‌, స్పూరస్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది తెలియరాలేదు.


Read more