గూగుల్‌ సెర్చ్‌ పర్సనల్‌ ఇన్ఫో డిలీట్‌ ఇలా

ABN , First Publish Date - 2022-09-24T06:05:09+05:30 IST

గూగుల్‌ ప్రైవసీ - ఓరియెంటెడ్‌ టూల్‌ని విడుదల చేసే యత్నంలో ఉంది. సెర్చ్‌ రిజల్ట్స్‌ నుంచి పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌ను తొలగించేందుకు ఈ టూల్‌ యూజర్లకు ఉపయోగపడుతుంది.

గూగుల్‌ సెర్చ్‌ పర్సనల్‌ ఇన్ఫో డిలీట్‌ ఇలా

గూగుల్‌ ప్రైవసీ - ఓరియెంటెడ్‌ టూల్‌ని విడుదల చేసే యత్నంలో ఉంది.  సెర్చ్‌ రిజల్ట్స్‌ నుంచి పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌ను తొలగించేందుకు ఈ టూల్‌ యూజర్లకు ఉపయోగపడుతుంది. ‘రిజల్ట్సు అబౌట్‌ యు’ పేరిట ఈ టూల్‌ని తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్‌ యూజర్లకు పరిమితమైన ఈ టూల్‌ ప్రస్తుతం యూరప్‌, అమెరికాలో మాత్రమే కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది. రైట్‌ కార్నర్‌లో ప్రొఫైల్‌ అవతార్‌ని టాపింగ్‌ చేయడం ద్వారా ఈ టూల్‌ని పొందవచ్చు. దీన్ని సెలెక్ట్‌ చేసిన వెంటనే ఫోన్‌ నంబర్‌, ఇంటి చిరునామా సహా వేటిని తొలగించాలన్న వివరాలను తెలియజేసే పేజీ దగ్గరకు వెళతాం. పర్సనల్‌ డేటాను తొలగించాలని ఇక్కడ యూజర్లు అభ్యర్థించవచ్చు. అబౌట్‌ దిస్‌ రిజల్ట్‌ పానెల్‌లో కొత్తగా ఉన్న రిమూవ్‌ రిజల్ట్‌ని క్లిక్‌ చేయడం ద్వారా రిక్వెస్ట్‌ పంపుకొనేందుకు అనుమతిస్తుంది. ఈ అభ్యర్థన విషయమై ప్రస్తుతం గూగుల్‌ సపోర్ట్‌ పేజీకి వెళుతున్నారు. అలా అభ్యర్థించిన తదుపరి స్టాటస్‌ని మానిటర్‌ చేసుకోవచ్చు. ఆల్‌ రిక్వస్ట్స్‌తో కొత్త పేజీ అందులో ఇన్‌ ప్రోగ్రస్‌, అప్రూవ్‌డ్‌ వంటి ఫిల్టర్లు కనిపిస్తాయి. ఇక్కడ కొత్త రిక్వెస్ట్‌లు కూడా చేసుకోవచ్చు. అభ్యర్థనలు అందిన తరవాత రిమూవ్‌ చేయాలని కోరుతున్న వాటి మూల్యాంకన జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్ని విషయం ఒకటుంది. తొలగింపు అంటే ఇంటర్నెట్‌ నుంచి రిమూవల్‌ కాదు. అదే కోరుకుంటే హోస్టింగ్‌ సైట్‌ను కాంటాక్ట్‌ చేయాల్సి ఉంటుంది.

Read more