ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ ప్రకటనలకు గూగుల్‌ నో

ABN , First Publish Date - 2022-12-10T11:29:13+05:30 IST

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్రకటనలను తమ సర్వీసుల్లో అనుమతించేది లేదని గూగుల్‌ పేర్కొంది. ఈ విషయంలో భారతదేశంలో అమలవుతున్న చట్టాలను

ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ ప్రకటనలకు గూగుల్‌ నో

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్రకటనలను తమ సర్వీసుల్లో అనుమతించేది లేదని గూగుల్‌ పేర్కొంది. ఈ విషయంలో భారతదేశంలో అమలవుతున్న చట్టాలను తాము తు.చ. తప్పకుండా పాటిస్తామని తెలిపింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్రకటనలను అనుమతించవద్దని పేర్కొంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ గతవారం లేఖ రాసిన మీదట గూగుల్‌ ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేయాల్సి వచ్చింది. సదరు ప్రకటనల విషయంలో తమ దృష్టికి వచ్చిన వెంటనే త్వరితగతిన చర్య తీసుకుంటామని కూడా గూగుల్‌ స్పష్టం చేసింది. గూగుల్‌ అటువంటి ప్రకటనలకు అవకాశం ఇస్తోందని గ్రహించే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు లేఖ రాసినట్టు సమాచారం. నిజానికి ఉల్లంఘన జరిగినప్పుడే కేంద్ర మంత్రిత్వశాఖ స్పందిస్తూ ఉంటుంది. దేశీయ బెట్టింగ్‌ సర్వీసులకు తోడు పారిమ్యాచ్‌, ఫెయిర్‌ప్లే, బెట్‌ వే వంటి ఆఫ్‌షోర్‌ వేదికల ఇతర చానల్స్‌ ఉపయోగించి తమను ప్రమోట్‌ చేసుకుంటున్నాయి. వీటన్నింటనీ గమనించిన కేంద్రం ఓటీటీ వేదికలు, డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్లు, టీవీ చానళ్ళు, ఇతర సోషల్‌ మీడియా వారికి బెట్టింగ్స్‌ యాడ్స్‌, సరోగేట్‌ యాడ్స్‌కు ప్రచారం కల్పించవద్దని ఆదేశించింది.

Updated Date - 2022-12-10T11:29:14+05:30 IST