గూగుల్‌ చాట్‌ మల్టీ సెండర్‌ ఫీచర్‌

ABN , First Publish Date - 2022-09-24T06:40:46+05:30 IST

కొన్ని అనుభవిస్తే కాని తెలియవు. అందుకు ఉదాహరణ గూగుల్‌ చాట్‌.

గూగుల్‌ చాట్‌ మల్టీ సెండర్‌ ఫీచర్‌

కొన్ని అనుభవిస్తే కాని తెలియవు. అందుకు ఉదాహరణ గూగుల్‌ చాట్‌. ముఖ్యంగా ఈ చాట్‌ను మొబైల్‌లో ఉపయోగిస్తుంటే, మీడియా ఫైల్స్‌ను పంపడం ఇబ్బందిగా ఉంటుంది. ఇక వీడియోలను పంపడం అంటే చాలా కష్టం. అయితే గూగుల్‌ ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది. మల్టీ-సెండ్‌ ఫీచర్‌ను జీమెయిల్‌ యాప్‌పై పొందవచ్చు. దీని సహాయంతో ఒకేసారి ఇరవై ఫొటోలు లేదా ఒక వీడియోను పంపుకోవచ్చు. ఇంతకుమునుపు ఒక్క ఇమేజ్‌ లేదంటే ఒక్క వీడియోను మాత్రమే పంపుకొనే సౌలభ్యం ఉండేది.       

ప్రస్తుతానికి ఐఫోన్‌ వినియోగదారులకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ డివైస్‌లకు ఈ నెలఖరులోగా ఈ సౌలభ్యం రానుంది. చాట్‌ వెబ్‌ వెర్షన్‌లో ఉంది. 

ఇంకా ఉన్న హ్యాంగౌట్స్‌ వెబ్‌వెర్షన్‌ నవంబర్‌తో ముగుస్తుంది. గూగుల్‌ ప్రిపేర్‌ చేస్తోందని చెబుతున్న చాట్‌లో అన్ని ముఖ్యమైన ఫీచర్లూ సాఫీగా ట్రాన్షిషన్‌కు వీలు కల్పించవచ్చు. అదేవిధంగా గూగుల్‌ వర్క్‌స్పేస్‌ టూల్‌, గూగుల్‌ మీట్‌కు కూడా న్యూ ఇంప్రూవ్‌మెంట్స్‌ జతకానున్నాయి. ఈ ఏడాది మొదట్లో మల్టీ పిన్నింగ్‌ను మీట్‌ ఇన్‌క్రోమ్‌కు చేర్చారు. దీన్నే మొబైల్‌ వెర్షన్‌కు కూడా ఇవ్వబోతున్నారు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ రెంటికీ ఇస్తారు. దీంతో ముగ్గురు పార్టిసిపెంట్స్‌కు వీడియో టైల్స్‌ని పిన్‌ చేయవచ్చు. అలాగే ఈ రెంటిలో గూగుల్‌ మొబైల్‌ యాప్‌ ‘పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌’ ఇంప్రూవ్‌మెంట్స్‌ను కలుపనుంది.

Updated Date - 2022-09-24T06:40:46+05:30 IST