మోడ్రన్‌ అవసరాలను తీర్చే గెలాక్సీ వాచీ 5ప్రొ

ABN , First Publish Date - 2022-09-17T08:06:52+05:30 IST

శాంసంగ్‌ ఇటీవల రెండు గెలాక్సీ వాచీలను ప్రకటించింది. అందులో ఒకటి గెలాక్సీ వాచ్‌5 కాగా మరొకటి గెలాక్సీ వాచ్‌ 5 ప్రొ. ఇందులో రెండోది శాంసంగ్‌కు చెందిన టాప్‌ ఎండ్‌ స్మార్ట్‌ ..

మోడ్రన్‌ అవసరాలను తీర్చే గెలాక్సీ వాచీ 5ప్రొ

శాంసంగ్‌ ఇటీవల రెండు గెలాక్సీ వాచీలను ప్రకటించింది. అందులో ఒకటి గెలాక్సీ వాచ్‌5 కాగా మరొకటి గెలాక్సీ వాచ్‌ 5 ప్రొ. ఇందులో రెండోది శాంసంగ్‌కు చెందిన టాప్‌ ఎండ్‌ స్మార్ట్‌ వాచీ. దీని రేటు రూ.44.999. మన్నికైన డిజైన్‌, సుదీర్ఘకాలం మనగలిగే బ్యాటరీ లైఫ్‌ దీని సొంతం. గూగుల్‌ వేర్‌ ఓఎస్‌, శాంసంగ్‌కే చెందిన టైజన్‌ ఓఎస్‌ - కంబైన్డ్‌ పవర్‌ కలిగి ఉంది. ఈ  వాచీని మరింత లోతుగా పరికిస్తే సాలిడ్‌గా ఉండటమే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ  ఉపయోగించుకోవచ్చు. హెవీ డ్యూటీ వర్కౌట్స్‌, విపరీతంగా ఆటలు, టెక్కింగ్‌ సమయంలోనూ ఈ వాచీని ధరించవచ్చు. 44 ఎం.ఎం సైజ్‌ కాగా దీని బరువు 52 గ్రాములే. మాగ్నటిక్‌ స్ట్రాప్‌ డిజైన్‌ కావడంతో చాలా త్వరగా దానిని యూజర్లు అడ్జస్ట్‌ చేసుకోగలుగుతారు. టచ్‌ బేస్డ్‌ రొటేటింగ్‌ డయల్‌ సౌలభ్యం ఉంది. అంటే రొటేటింగ్‌ బీజిల్‌కు స్వస్తి చెప్పింది. 


దుమ్ము, దూళిని ఆకట్టుకునే అవకాశం ఉన్నందునే దాన్ని విడనాడిందని చెప్పవచ్చు. లైటింగ్‌ కండిషన్‌ అనుగుణ్యమైన బ్రైట్‌ దీనిలో ఉంది. వేర్‌ ఓఎస్‌ 3.5 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ వాచీ వన్‌ యూ1 వాచ్‌ 4.5 అప్డేట్‌తో వచ్చింది. దీంతో గూగుల్‌ యాప్స్‌ సపోర్ట్‌ ఉంటుంది. అదేవిధంగా హెల్త్‌, ఫిట్‌నెస్‌ ఫీచర్స్‌కు అనుకూలంగానూ ఉంటుంది. 

టర్న్‌ బై టర్న్‌ నేవిగేషన్‌ ఫీచర్‌తో ముఖ్యంగా ట్రెకింగ్‌లో దారితప్పినా తిరిగి స్టార్టింగ్‌ పాయింట్‌ దగ్గరకు వచ్చేయవచ్చు. దీంట్లో స్కిన్‌ టెంపరేచర్‌ సెన్సర్‌ ఉంది. ప్రస్తుతం ఇది ఇంకా పనిచేయటం లేదు. ఉపయోగపడితే శరీరంలోని టెంపరేచర్‌ చూసుకునేందుకు నార్మల్‌ థర్మామీటర్‌ అవసరం ఉండదు. ఆక్సీమీటర్‌, హార్ట్‌రేట్‌ మానిటర్‌, స్ట్రెస్‌ ట్రాకింగ్‌, బాడీ మాస్‌ ఇండెక్స్‌, ఉమన్‌ హెల్త్‌ మానిటరింగ్‌, స్లీప్‌ ట్రాకింగ్‌ సంబంధిత సెన్సర్లు ఉన్నాయి. వర్కౌట్‌ మోడ్స్‌ సరే సరి. మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌  దీని మరో ప్రత్యేకత.

Updated Date - 2022-09-17T08:06:52+05:30 IST