ఈ ట్రిక్‌లతో మార్కెటింగ్‌ మెసేజ్‌లకు చెక్‌

ABN , First Publish Date - 2022-09-24T06:49:09+05:30 IST

ఈ ట్రిక్‌లతో మార్కెటింగ్‌ మెసేజ్‌లకు చెక్‌

ఈ ట్రిక్‌లతో మార్కెటింగ్‌ మెసేజ్‌లకు చెక్‌

ఈ రోజుల్లో ఈ మెయిల్‌ బాక్స్‌ అంటే వర్చ్యువల్‌ హోం కిందే లెక్క. కొత్త 

సర్వీసులు, జాబ్స్‌, ఆన్‌లైన్‌ కొనుగోళ్ళు అన్నీ ఉంటాయి. కాంటాక్ట్‌కు 

సంబంధించి ఫస్ట్‌ పాయింట్‌గా ఉంటుంది. అయితే ఎక్కడో కొనుగోలు

 చేస్తున్నప్పుడు పొరపాటుగా ఇచ్చిన మెయిల్‌ అడ్రస్‌ మరింత మంది 

మార్కెటీర్లకు చిక్కితే చాలు, ఇక అనవసర మెసేజ్‌లతో ఇన్‌బాక్స్‌ రోజూ

 నిండుతూ ఉంటుంది. అలాంటప్పుడు డెస్క్‌టాప్‌, ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 

రెంటిలో ఏమి చేయాలంటే...


డెస్క్‌టాప్‌ లేదంటే మొబైల్‌ ఫోన్‌లో జీమెయిల్‌ ఓపెన్‌ చేయాలి.

దేన్ని వద్దనుకుంటున్నారు ఆ మెయిల్‌ దగ్గరకు వెళ్ళాలి.

త్రీడాట్‌ మెనూ ఆప్షన్‌పై టాప్‌ చేయాలి.

అన్‌సబ్‌స్క్రయిబ్‌ ఆప్షన్‌ని హిట్‌ చేయాలి.


వద్దనుకునే ఈమెయిల్స్‌ను ఇంత తేలికగా వదిలించుకోవచ్చు. అలాగే ప్రమోషనల్‌ ఈమెయిల్స్‌కు సంబంధించి వాటిలోనే అన్‌సబ్‌స్క్రయిబ్‌ బటన్‌ ఉంటుంది. ఇన్‌బాక్స్‌ సెర్చ్‌బార్‌పై అన్‌సబ్‌స్క్రయుబ్‌ను ఎంటర్‌ చేసి, సెర్చ్‌బటన్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు అన్‌సబ్‌స్క్రయుబ్‌ బటన్‌ ఉన్న ఈమెయిల్స్‌ అన్నీ ప్రత్యక్షమవుతాయి. వెంటనే వాటన్నింటినీ సెలెక్ట్‌ చేసి డిలీట్‌ బటన్‌ను హిట్‌ చేస్తే చాలు. వాటిలో ముఖ్యమైనది అంటూ ఏదైనా ఉంటే దాన్ని డీసెలెక్ట్‌ కూడా చేసుకోవచ్చు.

Read more