ఐఓఎస్‌16లో ఆటోమేటిక్‌గా డూప్లికేట్‌ ఫొటోలు డిలీట్‌!

ABN , First Publish Date - 2022-10-01T06:16:03+05:30 IST

ఐఓఎస్‌16లో ఆటోమేటిక్‌గా డూప్లికేట్‌ ఫొటోలు డిలీట్‌!

ఐఓఎస్‌16లో ఆటోమేటిక్‌గా డూప్లికేట్‌ ఫొటోలు డిలీట్‌!

మొబైల్స్‌ లేదా లాప్‌టాప్‌ వంటి గాడ్జెట్లలో డూప్లికేట్‌ ఫొటోలు భారమే తప్ప వాటితో నిజానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఐఓఎస్‌16తో యాపిల్‌ ‘డూప్లికేట్స్‌ ఆల్బమ్‌’ టాబ్‌ని ఫొటోస్‌ యాప్‌ యుటిలిటీస్‌ సెక్షన్‌లో పెట్టింది. ఐఫోన్‌ లైబ్రరీలోని డూప్లికేట్‌ ఫొటోలు, వీడియోలను అది ఆటోమేటిక్‌గా కనుగొంటోంది. డూప్లికేట్స్‌ ఆల్బమ్‌ అనేది సంబంధిత కంటెంట్‌ ఉన్న సింగిల్‌ ఆల్బమ్‌. యూజర్లు దీన్నుంచి డూప్లికేట్‌గా ఉన్న వాటిని తొలగించుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే ఐఓఎస్‌ 16ని అప్‌డేట్‌ చేసుకున్నప్పటికీ కొన్ని ఫోన్లలో ఈ డూప్లికేట్‌ ఆల్బమ్‌ కనిపించడం లేదు. దరిమిలా దీన్ని ఎలా పొందవచ్చంటే..


యాపిల్‌ సపోర్ట్‌ డాక్యుమెంట్‌ ప్రకారం ఎగ్జిస్టింగ్‌ లైబ్రరీలో డూప్లికేట్‌ ఫొటోలు, వీడియోలు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. మీ లైబ్రరీలో డూప్లికేట్‌ మీడియా సేవ్‌ అయి ఉంటే, ఫొటోస్‌ యాప్‌లో డూప్లికేట్స్‌ ఆల్బమ్‌ లభ్యమవుతుంది. డిటెక్షన్‌ ప్రక్రియలో భాగంగా ఐఫోన్‌ యూజర్లు తమ డివైస్‌లను లాక్‌ చేసి చార్జింగ్‌లో పెట్టాలి. యాపిల్‌ సైతం డిటెక్షన్‌ ప్రక్రియను ఆరంభిస్తుంది. లైబ్రరీ సైజును అనుసరించి నిమిషాల నుంచి రోజులు తీసుకుంటుంది. ప్రక్రియ అంతా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతుంది. లైబ్రరీలో డూప్లికేట్‌ కంటెంట్‌ లేకపోతే మాత్రం యుటిలిటీస్‌ విభాగంలో డూప్లికేట్స్‌ ఆల్బమ్‌ కనిపించదు. ఐఫోన్‌ లైబ్రరీలో ఏదైనా ఫొటో లేదా ఒకదానికి మించి ఉంటేనే డూప్లికేట్స్‌ ఆల్బమ్‌ లభిస్తుంది. 

Read more