ఫిజికల్‌ టెస్టులకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-12-03T01:08:11+05:30 IST

ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల స్థాయి పోలీస్‌ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ఈ నెల 8నుంచి నిర్వహించే ఫిజికల్‌ టెస్టులకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఫిజికల్‌ టెస్టులు నిర్వహించే పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.

ఫిజికల్‌ టెస్టులకు పకడ్బందీ ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌

1669989646511.jpgసిబ్బందికి సూచనలు చేస్తున్న సీపీ

పరుగు పూర్తిచేసిన వారికే ఎత్తు కొలత

బయోమెట్రిక్‌ అనంతరం ఆర్‌ఎ్‌ఫఐడీ బ్యాండ్స్‌

అభ్యర్థులు బోర్డు నిబంధనలు పాటించాలి

పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించిన సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌

ఖమ్మం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల స్థాయి పోలీస్‌ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ఈ నెల 8నుంచి నిర్వహించే ఫిజికల్‌ టెస్టులకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఫిజికల్‌ టెస్టులు నిర్వహించే పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 25వేల మంది అభ్యర్థులు ఈవెంట్లకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఆయా అభ్యర్థులందరూ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లోనే టెస్టులకు హాజరుకావాలని, వారి డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం పురుషులకు 1600మీటర్లు, మహిళలకు 800మీటర్ల పరుగు నిర్వహించనున్నట్టు తెలిపారు. నిర్ణీత సమయంలో పరుగు పూర్తిచేసిన వారికి మాత్రమే ఎత్తు కొలత ఉంటుందని, నిర్ణీత ఎత్తు ఉన్నవారికే లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీలకు అనుమతిస్తారని తెలిపారు. పూర్తిగా డిజిటల్‌ ఎక్వై్‌పమెంట్లతో నిర్వహించే ఈవెంట్స్‌కు ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్‌ ఉంటుందన్నారు. అనంతరం డిజిటల్‌ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన (ఆర్‌ఎ్‌ఫఐడీ) బ్యాండ్లను అటాచ చేస్తారని తెలిపారు. ఫిజికల్‌ టెస్టులు నిర్వహించే మైదానాల్లో ఇంటర్‌నెట్‌ అందుబాటులో ఉంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఫిజికల్‌ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు డాక్యుమెంట్లు, అడ్మిట్‌ కార్టులు వెంట తెచ్చుకోవాలన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన సమయంలో ఆయనతోపాటు అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు ఆంజనేయులు, ప్రసన్నకుమార్‌, ఆర్‌ఐలు రవి, సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం, సీఐలు చిట్టిబాబు, అంజలి, అశోక్‌కుమార్‌, సత్యనారాయణరెడ్డి, యూనిట్‌ డాక్టర్‌ జితేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-03T01:08:12+05:30 IST