యాపిల్‌ మెడికేషన్‌ యాప్‌

ABN , First Publish Date - 2022-09-17T08:11:26+05:30 IST

కొవిడ్‌ అనంతర కాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు పెరిగాయి. తమదైన ఫీచర్లతో మొబైల్‌, వాచ్‌ కంపెనీలు వీటిని అందిపుచ్చుకుంటున్నాయి.

యాపిల్‌ మెడికేషన్‌ యాప్‌

కొవిడ్‌ అనంతర కాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు పెరిగాయి. తమదైన ఫీచర్లతో మొబైల్‌, వాచ్‌ కంపెనీలు వీటిని అందిపుచ్చుకుంటున్నాయి.  యాపిల్‌  కూడా తనదైన శైలిలో  యూజర్లకు విశేష సేవలు అందిస్తోంది. అందుకే తన డివైస్‌ల్లో హెల్త్‌, ఫిట్‌నెస్‌ ఫీచర్లకు యాపిల్‌ చాలా ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా మెడికేషన్‌పై గురిపెట్టింది. వాచ్‌ ఓఎస్‌ 9కి సరికొత్త మెడికేషన్‌ యాప్‌ని అనుసంధానం చేసింది. ఈ యాప్‌ సహాయంతో వేళకు మందులు తీసుకోవడం సులువు అవుతుంది. అంటే ఏ టాబ్లెట్స్‌ ఎప్పుడు తీసుకోవాలన్నది రిమైండర్లతో హెచ్చరిస్తూ ఉంటుంది. దీన్నెలా ఉపయోగించుకోవాలి అంటే...


  • ఐఫోన్‌లో హెల్త్‌ యాప్‌ని ఓపెన్‌ చేసి మెడికేషన్స్‌ను టాప్‌ చేయాలి.
  • యాడ్‌ ఎ మెడికేషన్‌ను టాప్‌ చేయాలి.
  • మెడిసిన్‌ నేమ్‌ను కొట్టిపెట్టుకుని తరవాతి చర్య కోసం టాప్‌ చేయాలి.
  • మెడికేషన్‌ టైప్‌ని ఆపై ఎంచుకోవాలి. అక్కడ క్యాప్సుల్‌, టాబ్లెట్‌, లిక్విడ్‌, క్రీమ్‌ అంటూ లెక్కలేనన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మెడికేషన్‌ స్ట్రెంథ్‌ని కలపాలి. అంటే ఎజీ, జి, మిల్లీ, ఎంసీజీ(పరిమాణం)ని ఎంపిక చేసుకోవాలి.
  • మెడిసిన్‌ షేప్‌ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. క్రీమ్‌, పౌడర్‌, టాబ్లెట్‌ లేదంటే క్యాప్సుల్‌లో ఏది అన్నది ఎంచుకోవాలి.
  • ఆపై మెడిసిన్‌ కలర్‌ని కూడా ఎంచుకోవచ్చు. అంతే, ఇకపై నిర్దేశించుకున్న విధంగా యాపిల్‌ వాచీ సమయం ప్రకారం యూజర్‌ని హెచ్చరిస్తూ ఉంటుంది. 
  • మెడికేషన్‌కు లాగ్‌ అయ్యేందుకు
  • మెడికేషన్స్‌కు లాగ్‌ అయ్యేందుకు నోటిఫికేషన్‌ రాగానే, దానిపై టాప్‌ చేయాలి. లేదంటే యాపిల్‌ వాచీలో మెడికేషన్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి.
  • కరంట్‌ మెడికేషన్స్‌ షెడ్యూల్‌ని టాప్‌ చేయాలి. ఉదాహరణకు ఉదయం పూట మెడికేషన్‌ అనుకోండి..
  • లాగ్‌ ఆల్‌ యాజ్‌ టేకెన్‌. డోసేజ్‌, తీసుకున్న యూనిట్లు, సమయం అన్నింటినీ అక్కడ రికార్డు చేస్తుంది. 
  • వ్యక్తిగత మెడికేషన్స్‌ కోసం స్ర్కోల్‌ డౌన్‌, మెడికేషన్స్‌ కింద మెడికేషన్‌పై టాప్‌, తదుపరి లాగ్‌ చేయాలి. లాగ్డ్‌ కింద మెడికేషన్స్‌ పేరు, లాగ్‌ చేసిన సమయం కనిపిస్తాయి. 
  • మెడికేషన్‌కు సంబంధించి స్టాటస్‌లో మార్పునకు టాప్‌ చేయాలి, టాప్‌ తీసుకోవాలి లేదా స్కిప్‌ చేయాలి, చివరగా టాప్‌ చేయాలి.
  • లాగ్‌, మెడికేషన్‌ హిస్టరీని చూసేందుకు ఐఫోన్‌లో హెల్త్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. బ్రౌజ్‌ని తదుపరి అలాగే మెడికేషన్స్‌ని టాప్‌ చేయాలి. 

Updated Date - 2022-09-17T08:11:26+05:30 IST