Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఇంట్లో బస చేసే లక్కీ ఛాన్స్... తొలిసారి ఇలాంటి అవకాశం..

ABN , First Publish Date - 2022-09-28T23:59:56+05:30 IST

టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన అభిమానులతో ప్రత్యేక అనుబంధాన్ని కోరుకుంటాడు.

Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఇంట్లో బస చేసే లక్కీ ఛాన్స్... తొలిసారి ఇలాంటి అవకాశం..

టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన అభిమానులతో ప్రత్యేక అనుబంధాన్ని కోరుకుంటాడు. అభిమానులను అప్యాయంగా పలకరించాలని ఆశించే ఈ సిక్సర్ల వీరుడు.. ఫ్యాన్స్ ఎదురుపడి సెల్ఫీ అడిగితే కాదనే ప్రసక్తే ఉండదు. అభిమానులతో మరింత అటాచ్‌మెంట్ కోరుకుంటున్న యువీ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎంతో ఇష్టంతో గోవా(Goa)లో  నిర్మించుకున్న ఇల్లు ‘కాసా సింగ్ ’ (Casa singh)లో ఆరుగురు వ్యక్తుల బృందానికి బస సౌకర్యాన్ని కల్పించనున్నాడు.   వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) సౌజన్యంతో ఈ అవకాశాన్ని ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన బుకింగ్స్ సెప్టెంబర్ 28 (బుధవారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌బీఎన్‌బీ‌పై మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఆరుగురు వ్యక్తులు అక్టోబర్ 14 నుంచి 16 వరకు 2 రాత్రులు యువరాజు ఇంట్లో బస చేయవచ్చు. ఒక్కో రాత్రికి రూ.1200 వసూలు చేయనున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. భారతీయులతోపాటు విదేశీ వ్యక్తులు కూడా బుక్ చేసుకోవచ్చని ఎయిర్‌బీఎన్‌బీ తెలిపింది. యువరాజ్ సింగ్ కూడా ఈ విషయంపై ఇన్‌‌స్టాగ్రామ్ వేదికగా వివరాలు వెల్లడించాడు. ‘‘ వృత్తి రీత్యా ప్రపంచమంతా తిరుగుతున్నా.. నాకు, నా ప్రియమైన వ్యక్తులకు గోవాలోని నా ఇల్లే ఏకాంత ప్రదేశం. నా హాలిడే హోంలో ఆరుగురు వ్యక్తుల బృందానికి బస అవకాశం ఇస్తున్నందుకు సంతోషపడుతున్నాను. ఎయిర్‌బీఎన్‌బీపై మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది’’ అని యువరాజ్ సింగ్ తెలిపాడు. ఇంట్లో బస చేసే వ్యక్తులతో వర్చువల్‌గా మాట్లాడుతానని వెల్లడించాడు. దివార్ ద్వీపం అందాలు, ఈ-బైక్ టూర్, ఆహార పదార్థాలు, సముద్ర తీరాలను ఆస్వాదించొచ్చని  పేర్కొన్నాడు. ఇక యువరాజ్ సింగ్ ఇంట్లో తన క్రెడిట్ కెరీయర్‌లో కీలకమైన మైలురాళ్లకు సంబంధించిన ఫొటోలు వీక్షించవచ్చు. కాగా యువరాజ్ ఇంట్లో బస చేయబోయే ఆరుగురు వ్యక్తులు ఎవరో ఇప్పటికే తేలిపోయుంటుందని అంచనాగా ఉంది.

Read more