ప్రపంచ నంబర్ వన్ tennis star ఆష్లీ బార్టీ రిటైర్మెంట్...సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-03-23T13:45:03+05:30 IST

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ బుధవారం సంచలన ప్రకటన చేశారు...

ప్రపంచ నంబర్ వన్ tennis star ఆష్లీ బార్టీ రిటైర్మెంట్...సంచలన ప్రకటన

మెల్‌బోర్న్: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ బుధవారం సంచలన ప్రకటన చేశారు.తాను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ ఆష్లీబార్టీ ప్రకటించారు. ఆస్ట్రేలియా నుంచి మూడుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన బార్టీ గురువారం జరగనున్న విలేకరుల సమావేశానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్రకటన చేశారు.‘‘నేను టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించినందున ఈ రోజు నేను భావోద్వేగానికి గురయ్యాను. ఈ వార్తలను మీతో ఎలా పంచుకోవాలో నాకు తెలియలేదు కాబట్టి నాకు సహాయం చేయమని నా స్నేహితుడిని అడిగాను. ఈ క్రీడలో ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. నాకు మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’అని బార్టీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్ టైటిల్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.


Read more